విజయనగరం, సెప్టెంబర్ 24: పట్టణంలోని అయ్యన్నపేటకు చెందిన వైకాపా నేత మజ్జి త్రినాధరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. ఉదయం ఆంజనేయస్వామికి కుంకుమతో అర్చన అనంతరం 101 కొబ్బరికాయలను కొట్టి జగన్ విడుదల కావాలని మొక్కుకున్నారు.
విజయనగరం : రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారని భవిష్యత్ ముఖ్యమంత్రి జగనేనని ఆపార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ అన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ జగన్‌కు ఉన్న జనబలం ముందు కాంగ్రెస్ టిడిపిల కుమ్మక్కు రాజకీయాలు ఎందుకూ పనికి రావని విమర్శించారు. పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, అవనాపు విక్రమ్ చల్లా శివన్నారాయణ, చందక శ్రీను పాల్గొన్నారు.
గజపతినగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విడుదలైన సందర్భంగా ఆపార్టీ నాయకులు మంగళవారం ఆనందంలో మునిగితెలారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేసుకుంటూ ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, నాయకులు ఎస్.శారదానాయుడు, తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం : వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 485 రోజు తర్వాత జైలు నుండి మంగళవారం విడుదలైన సందర్భంలో స్థానిక వైఎస్సార్‌సిపి పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నాయకులు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బాణా సంచా కాల్చుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తిమిడిశెట్టి రమేష్ , నాయకులు ప్రసాద్, సుందర గోవింద, పైడిరాజు, శంరరావులు పాల్గొన్నారు.
దత్తిరాజేరు : రాష్ట్ర వైసిపి నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో మండల వైసికా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మండల వైసిపి కన్వీనర్ బి.సత్తిబాబు ఆధ్వర్యంలో సర్పంచ్ జగన్నాధం, మాజీ సర్పంచ్ సత్తిబాబు, గౌరినాయుడు, మాజీ జెడ్‌పిటిసి లక్ష్మిలతోపాటు పలువురు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
పట్టణంలోని అయ్యన్నపేటకు చెందిన వైకాపా నేత మజ్జి త్రినాధరావు
english title:
poojalu
Date:
Wednesday, September 25, 2013