కేరళలో మద్యానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితం దక్కుతోంది. ప్రజల్లో వస్తున్న చైతన్యం కారణంగా ఆ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మహిళా సంఘాలతో పాటు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యపాన వ్యతిరేక ప్రచారం చేపట్టటంతో సామాజికంగానూ మార్పులు చోటు చేసు కుంటున్నాయ. మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టిన మాట నిజమేనని కేరళ ఎక్సయజ్ శాఖా మంత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది జూలైనాటికి 5 శాతం మేరకు అమ్మకాలు తగ్గినట్లు చెప్పారు. గత ఏడాది 34.5 మిలియన్ కేసుల మద్యం అమ్మకాలు జరగ్గా 8,818 కోట్ల రూపాయల ఆ దాయం వచ్చింది. 2011-12లో 33.8 మిలియన్ల కేసుల అమ్మకాలు జరగ్గా 7,681 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జూలైనాటికి 11.5 మిలియన్ల కేసుల అమ్మకాలు జరపగా 3,005 కోట్ల ఆదాయం వచ్చింది. కేరళ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ (కెఎస్‌బిసి) నేతృత్వంలో మద్యం సరఫరా జరుగుతోంది. మద్యపాన వ్యతిరేక ప్రచారానికి కేటాయించే నిధులను కూడా భారీగా పెంచుతున్నారు. గత ఏ డాది కేవలం 25 లక్షలు కేటాయంచగా, ఈ ఏడాది కే టాయంపులను 2 కోట్లకు పెంచటంతో మద్యపాన వ్యతిరేక ప్రచారం సఫలమవుతోంది. విద్యాసంస్థలలో కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాలలో 55 శాతం ఆదాయంతో సారాయ అగ్రస్ధానంలో ఉంది. 40 శాతం అమ్మకాలతో బ్రాందీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఓడ్కా 4 శాతం మేరకు, జిన్, విస్కీ ఒక్కో శాతం అమ్మకాలతో తరువాత స్థానాల్లో నిలిచాయి. కేరళలో మద్యం అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు నిజమేనని అక్కడి వైద్యులు సైతం అంగీకరిస్తున్నారు. దీనిపై ఓ ప్రముఖ వైద్యుడు మాట్లాడుతూ, మద్యపానంతో కాలేయం దెబ్బతిన్న రోగులు తమ ఆస్పత్రికి నెలలో కనీసం ముగ్గురైనా వచ్చేవారని, ఇటీవలి కాలంలో ఇలాంటి పేషెంట్ల సంఖ్య తగ్గిపోయిందని అంగీకరిస్తున్నారు. మ ద్యపాన వ్యతిరేక ప్రచారం ప్రజల వద్దకు బాగానే చేరిందన్నమాట. ప్రభుత్వం, ప్రజలు కలిసి పూ నుకుంటే మద్యం మహమ్మారిని కొంతమేరకైనా ని యంత్రించవచ్చని కేరళలో రుజువైంది. *
కేరళలో మద్యానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితం దక్కుతోంది.
english title:
m
Date:
Wednesday, September 25, 2013