Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బంద్ సంపూర్ణం

$
0
0

విజయనగరం, సెప్టెంబర్ 24: సమైక్యాంధ్ర కోసం జిల్లాలో ఉద్యోగ ఐకాసా చేపట్టిన బంద్ విజయవంతమైంది. సీమాంధ్ర ఐకాసా పిలుపుమేరకు జిల్లాలో బంద్ పాటించారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. మంగళవారం ఉదయం 6 గంటలకే ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. పట్టణంలోనికి ప్రవేశ మార్గాలుగా ఉన్న ఎనిమిది రోడ్ల వద్ద వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టణంలోని కలెక్టరేట్ జంక్షన్ వద్ద, కోరుకొండ వై జంక్షన్ వద్ద, పెద్దతాడివాడ, ధర్మపురి, అయ్యన్నపేట, పూల్‌బాగ్, జమ్ము తదితర గ్రామాల వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు పట్టణంలోకి రావడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. పట్టణంలోని ముస్లిం సోదరులు అంబటి సత్రం దర్గా నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ మూడులాంతర్లు, గంటస్తంభం, బాలాజీ జంక్షన్, కోట మీదుగా అంబటిసత్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మూడులాంతర్ల వద్ద ముస్లింలు మానవహారం నిర్వహించారు. ప్లే కార్డులు పట్టుకొని సమైక్యాంధ్రను కొనసాగించాలని నినాదాలు చేశారు.
కొనసాగుతున్న దీక్షలు
కోట జంక్షన్ వద్ద ఉపాధ్యాయ పోరాట సమితి, ఇంటర్ విద్యా, మున్సిపల్ ఉపాధ్యాయులు, న్యాయవాదులు రిలే దీక్షలు కొనసాగించారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. కాగా, కలెక్టరేట్ వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంగా మోటార్‌బైక్‌లను పెట్టడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎంఆర్‌పిజి కళాశాలలో రెండోరోజు దీక్షలు కొనసాగించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిమ్మకాయలను పంపిణీ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆశపు వేణు, జమ్ము శ్రీను తదితరులు మాట్లాడుతూ తమ నేతకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ జెఎసి చేపట్టిన బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
పంచాయతీ తీర్మానాలు
చీపురుపల్లిలో సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ 16 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. వీటిని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నట్టు ఉద్యోగ ఐకాస నేతలు తెలిపారు. సాలూరులో జీగిరాం జూట్ కార్మికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. దీంతో మిల్లు మూతపడింది. ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బోగాపురం, గజపతినగరం, ఎస్.కోట, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమమని ఎంఆర్‌పిజి కళాశాల డైరెక్టర్ పి.తవిటినాయుడు అన్నారు. రాజకీయ నాయకులతో సంబంధం లేని మొదటి ఉద్యమంగా ఆయన పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంఆర్‌పిజి కళాశాల ఆధ్వర్యంలో రెండోరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర ప్రజలకు న్యాయ నిర్ణయం చేయాలన్నారు. కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయనగరం-పాలకొండ రహదారిపై మానవహారం చేపట్టారు. కాగా, కళాశాలలో చేపట్టిన రెండో రోజు దీక్షల్లో డైరెక్టర్ ప్రొఫెసర్ పి.తవిటినాయుడు, ప్రొఫెసర్ బిఎ సత్యమూర్తి, కామర్స్ విభాగాధిపతి కరుణ, ఎస్.సర్వలక్ష్మి, కెవిఎస్ ప్రసాదరావులు పాల్గొన్నారు. వీరికి ఎపిఎన్జీవో ప్రతినిధులు వచ్చి తమ సంఘీభావం తెలిపారు.
మూతపడిన కార్యాలయాలు...
ప్రజల ఇబ్బందులు
విజయనగరం : రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మంగళవారం పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా పాన్‌షాపులు, టీ దుకాణాలు సైతం మూతపడటంతో అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకులు మూతపడటంతో పట్టణంలో 150 కోట్ల రూపాయల మేరకు వ్యాపారాలావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అదేవిధంగా బంగారం, వస్త్ర, ఇతర దుకాణాలు మూతపడటంతో మరో రెండున్నర కోట్ల రూపాయల మేరకు వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం మూతపడటంతో పాలసీదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. పెట్రోల్ బంక్‌లు సైతం మూతపడటంతో వాహనచోదకులు నరకయాతన అనుభవించారు. బంద్ కారణంగా జనజీవనం స్తంభించడంతో పట్టణంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీజంక్షన్, గంటస్తంభం జంక్షన్ తదితర ప్రధానమైన జంక్షన్‌ల్లో రోడ్లకు అడ్డంగా వాహనాలు పెట్టి వాహనాల రాకపోకలను సమైక్యవాదులు నిలిపివేశారు. అక్కడక్కడ స్వల్ప వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు సకాలంలో చేరుకుని సర్థి చెప్పడంతో గోడలు సద్దిమణిగాయి.

కొనసాగుతున్న నిరసనలు
విజయనగరం, సెప్టెంబర్ 24: రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న రిలేనిరాహారదీక్షలు నిరాటకంగా కొనసాగుతున్నాయి. రాష్టవ్రిభజన ప్రకటనను వెనక్కి తీసుకువరకూ నిరసనదీక్షలు కొనసాగిస్తామని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు చేపడుతున్న రిలేనిరాహారదీక్షలు మంగళవారం నాటికి 43వరోజుకు చేరుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకూ నిరసనదీక్షలు కొనసాగిస్తామని మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అప్పయ్యశెట్టి తెలిపారు. రాష్టవ్రిభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా మున్సిపాలిటీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయని తెలిపారు. అందువల్ల రాష్టవ్రిభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కోటజంక్షన్ వద్ద మున్సిపల్ ఉపాధ్యాయులు చేపడుతున్న రిలేనిరాహారదీక్షలు 34వరోజుకు చేరుకున్నాయి. ఉద్యమం తీవ్రమైనా ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎం.ఆర్.కళాశాల వద్ద అధ్యాపకులు చేపడుతున్న నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. కోట జంక్షన్ వద్ద ఇంటర్‌విద్య ఉద్యోగులు రిలేనిరాహారదీక్షలను చేపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదాలు చేశారు.
చీపురుపల్లిలో..
చీపురుపల్లి, : చీపురుపల్లి మంగళవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు బ్యాంకులు, వ్యాపారదుకాణాలు సంస్థలు మూత పడ్డాయి. ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో ఆర్టీసి కాంప్లెక్స్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. మహిళా ఉపాధ్యాయులు కూర్చీలాట ఆడి నిరసన తెలిపారు. ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయులు రోడ్డుపై మోకాళ్లతో నడుస్తూ నిరసన తెలిపారు. చీపురుపల్లి కోర్టు ఆవరణలో న్యాయశాఖ సిబ్బంది ఆందోళన చేపట్టారు. నోటి నల్లబాడ్జీలతో కోర్టు నుండి పాతయాత్ర జరిపారు. తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎపి ఎన్‌జిఓలు రెవెన్యూ సిబ్బంది దీక్షలు చేసి ఆందోళన తెలిపారు. పట్టణానికి వర్తక వ్యాపారులు, చిరువ్యాపారులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి రోడ్డుపై మోకాళ్లతో నడుస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ ఎన్ సింహాద్రినాయుడు, బొత్స గౌతమ్‌నాయుడు, ఉపాధ్యాయ ప్రతినిధులు అంపోలు సత్యన్నారాయణ, వలిరెడ్డి రవీంద్రనాయుడు, మురళి, ఎన్. బలరామ్, కోర్టు సిబ్బంది జగన్నాధం, గున్నయ్య, సూర్యనారాయణ, ప్రమీళ, రత్నం, తవిటినాయుడు, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళన
విజయనగరం (్ఫర్టు): రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన ఉథృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్‌యూనియన్ జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ హెచ్చరించారు. జిల్లాబంద్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్టవ్రిభజన వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీకి పెద్దఎత్తున నష్టం జరుగుతుందన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. జీతభత్యాల కోసం సమ్మె చేయడంలేదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఎ.పి.ఎన్జీఒ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు గత నెల 12వతేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి దిగామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి శ్రీనివాసరాజు, రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి, నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు బి.ఎస్.రాములు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల ధర్నా
గుర్ల, : సమైక్యాంధ్రకు మద్దతుగా మండల కేంద్రంలో ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి విజయనరగం- పాలకొండ రహదారిని దిగ్బంధించారు. ఇక్కడి వ్యాపార దుకాణాలు, బ్యాంకులను మూసి వేయించారు. వాహనాల రాకపోకలను నిలిచిపోవడంతో ప్రధాన కూడలి నిర్మానుష్యమైంది. ఈ సందర్భంగా సోనియా,కెసిఆర్, బొత్సలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గొర్రెలతో నిరసన
మెరకముడిదాం : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మండల ఉపాధ్యాయ ఐకాస మంగళవారం గర్భాంలో గొర్రెలు కాస్తూ నిరసనను తెలియజేసారు. గర్భాం నాలుగురోడ్ల కూడలి వద్ద ఐకాస నేత ఆల్తి రాంబు, విశ్రాంతి ఉపాధ్యాయ నేత తాడ్డి అప్పలనాయుడులు మాట్లాడుతూ కాంగ్రెస్ 5.5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకుని వేలాడడం వారి పదవీ కాంక్షకు నిదర్శనమని వీరు ఆరోపించారు. సమైక్య రాష్ట్రాన్ని సాదించుకనేంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని వీరు అన్నారు.

సమైక్యాంధ్ర కోసం జిల్లాలో ఉద్యోగ ఐకాసా చేపట్టిన బంద్
english title: 
bandh total

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>