అనంతపురం, సెప్టెంబర్ 25 : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు 57 రోజులకు చేరుకున్నాయి. ఇలా జిల్లాలోగడచిన 57 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలతోసమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతూనే ఉంది. కొనసాగుతున్న నిరసనలతో పరిపాలన పూర్తిగా కుంటుపడగా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో జిల్లాలోని ఆర్టీసీ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులన్నీ ఆయా డిపోల్లోనే నిలిచిపోయాయి. కాగా సంస్థకు సుమారుగా రూ. 50 కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. ఇక బ్యాంకులు కూడా అడపాదడపా పని చేస్తుండడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీనివల్ల అన్ని వర్గాలకూ చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన విద్యార్థుల చదువులు పూర్తిగా అటకెక్కాయి. ఇక వీటితోపాటు వివిధ కళాశాలలు కూడా స్వఛ్ఛందంగా మూతపడడంతోఅన్ని కళాశాలలకు చెందిన విద్యార్థుల చదువులు కూడా నిలిచిపోయాయి.ఇక ఉద్యోగులకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అన్ని వర్గాలకూ చెందిన ప్రజలు ఉద్యమం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమైక్య కాంక్షను మాత్రం వీడడం లేదు. జిల్లాలో అన్ని వర్గాలకూ చెందిన ప్రజల కలయికతోసమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతి 57 రోజులకు చేరుకుంది. ఇక జిల్లా కేంద్రంలో అనంత ఐకాస స్టీరింగ్ కమిటీ నేతృత్వంలో 57వ రోజు రైతు రంకె బహిరంగ సభను నిర్వహించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొని సభను విజయవంతంగా ముగించారు. ఇప్పటికే వరస కరవులతోసతమతమవుతున్న జిల్లా విభజన వల్ల ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం పై కేంద్రం పునరాలోచన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధ్ధృతంగా కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఇక ఈ సభలో విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా జాతీయ నాయకుల వేషధారణలోసభకు హాజరైన చిన్నారులు అందరికీ అలరించారు. అనంతరం రైతులు జై సమైక్యాంధ్ర, విభజనను అడ్డుకుంటాం, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక జిల్లా కేంద్రంలో కళాసాగర్, డ్యాన్స్, ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది మానవహారం ఏర్పాటుచేశారు. ఇక తహసీల్దారు కార్యాలయం ముందు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ నాయకులు రోడ్డు పైనే మోకాళ్ల పై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఇక విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు నగరంలో వేరుశెనగ కాయలు, సిగరెట్లు అమ్ముతూ తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇక వీరితోపాటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది డ్రమ్స్ కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు
కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా పంచాయతీరాజ్, ఉపాధ్యాయులు, హెచ్‌యన్‌యస్‌యస్ ఉద్యోగులు, గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖ, విద్యుత్ ఉద్యోగులు, జెయన్‌టియు, ఎస్‌కె యూనివర్శిటీ సిబ్బంది రిలే దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక వీరితోపాటు అన్ని శాఖలకూ చెందిన ఉద్యోగులు వారి వారి కార్యాలయాల ముందు ఏర్పాటుచేసిన దీక్షా శిబిరాలను కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఇక గుంతకల్లు లో టిడిపి ఆధ్వర్యంలో తాపీ పనులు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ఎంపి పొన్నం ప్రభాకర్, తెలంగాణ జాగృతి సంస్థ నాయకురాలు కవిత ల దిష్టిబొమ్మలను సమైక్యాంధ్ర ఉద్యమకారులు దగ్ధం చేశారు. ఇక హిందూపురం లోపలు ఐకాస లకు చెందిన నాయకులు మోకాళ్ల పై నిలబడి తమ నిరసనలు కొనసాగించారు. ఇలా జిల్లాలోని కదిరి, గుత్తి, ఉరవకొండ, రాయదుర్గం, రాప్తాడు, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, గోరంట్ల లలోపెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు కొనసాగించారు.
ఆగని సమైక్య నిరసనలు
గుంతకల్లు, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్దృతంగా మారుతుంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలు అలుపెరగని పోరాటం దాదాపు రెండు నెలలుగా కొనసాగుతుంది. అందులో బాగంగానే గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు ఉద్దృతంగా మారుతున్నాయి. జెఏసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద కర్రసాములతో యువకులు కర్రలు తిప్పి సమైక్య సమరోత్సాహన్ని చాటుకున్నారు. దీంతో కిరోసిన్‌ను మంటల ఊది మంటలతో యువకులు విన్యాసాలు నిర్వహించారు. దీంతో సమరాన్ని తలపించే విధంగా కర్రసాముల విన్యాసాలు, అగ్ని శిఖలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జెఏసి చైర్మన్ మునివేలు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉదయభాను, శశికళ, నాగరాజు, శోభ, ఆంజినేయులు, నారాయణ స్వామిలు దీక్షల్లో పాల్గొన్నారు.
రోడ్డుపై గోడ కట్టి టిడిపి నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం టిడిపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శిబిరం వద్ద నాయకులు గోడలు కట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాపీ మేస్ర్తి బాషా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి జితేంద్రగౌడ్, పట్టణ టిడిపి ఆధ్యక్షులు బండారు ఆనంద్, కార్యదర్శి గుజిరి మహ్మద్‌ఖాజా, తెలుగుయువత నాయకులు, మాజీ కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 54వ రోజు రిలే దీక్షలు బుధవారం కొనసాగాయి. దీక్షల్లో చాకలి కృష్ణ, ఆంజినేయులు, హనుమంతు, రామాంజినేయులు, శ్యాం, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ డిసిసి కార్యదర్శి రామాంజినేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మన్సూర్ అహ్మద్, కంబగిరి, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు రామలింగప్ప, గోపా జగదీష్‌లతో పాటు నాయకులు సంఘీభావం తెలిపారు.
వైకాపా ఆధ్వర్యంలో 40 వ రోజు దీక్షల్లో బుధవారం గోపాల్, నిజార్, పెద్దరాజు, ఆంజినేయులు, ఆది, లాలూ, పుల్లయ్య, ఈరన్న, రామాంజినేయులు, నాగేంద్రలు పాల్గొన్నారు. వీరికి వైకాపా నాయకులు భీమలింగప్ప, సుధాకర్, శంకర్, సందీప్ రెడ్డిలు సంఘీభావం తెలిపారు.
గుత్తిలో...
గుత్తి: రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేస్తూ గత 56రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమైక్యవాదులు బుధవారం తమ ఆందోళన కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ జెఎసి, ప్రజా సంఘాల జెఎసి, టిడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు యధావిధిగా కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జెఎసి నాయకులు మనోహర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటువాదులు చేస్తున్న కుట్రలను కొనసాగనివ్వమని, రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు ఎలాంటి త్యాగాలకైనా వేనుకాడే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలు సమైక్య ఉద్యమాన్ని సొంతంగా నడపడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జెఎసి నాయకులు మల్లికార్జున, జెవివి నాయకులు ఇస్మాయిల్, విరూపాక్షిరెడ్డి, న్యాయవాది ఇస్మాయిల్, ఊటకల్లు సర్పంచ్ సుబ్బారెడ్డి, టిడిపి నాయకులు శ్రీనివాసయాదవ్, శివలింగారెడ్డి, దిల్‌ఖాశీనా, భాస్కర్‌స్వామి పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో వైకాపా నిరసన
ఉరవకొండ: సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం వైకాపా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కవితా హోటల్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా దత్తసేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెఎసి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలో తెలుగుతల్లి, శ్రీకృష్ణదేవరాయలు, భారతమాత, మహాత్మాగాంధీ, దేశభక్తుల వేషాధారణలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ, కెసిఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితా హోటల్ సర్కిల్‌లో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించి, భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
మండల టిడిపి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు శంకరప్ప, రామాంజినేయులు, నాగేశ్వరరావ్, ప్రసాద్, జెఎసి నాయకులు హనుమప్ప, శ్రీరాములు, నాగేంద్ర, నారాయణస్వామి, ప్రభాకర్, దత్తాసేవా కమిటీ అధ్యక్షులు నంద్యాలస్వామి, వైకాపా నాయకులు తేజోనాథ్, అశోక్, తిప్పయ్య, సోమశేఖర్, పట్టణ కన్వీనర్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ
కణేకల్లు: సమైక్యాంధ్రకు మద్దతుగా మండల ఉపాధ్యాయ జెఎసి అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, ఎన్జీఓల అధ్యక్షులు సయ్యద్ షఫీల ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు ప్రాంతం నుండి దిగువగేరి, రామ్‌నగర్ ప్రాంతం వరకు ర్యాలీ నిర్వహించి, సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెఎసి నాయకులు శేషారెడ్డి, చిక్కణ్ణ, పరమేశ్వర, చెన్నారెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
27న బారిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 27న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బారిక సంఘం అధ్యక్షులు రామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీతో పాటు వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బారిక కులస్థులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
చేనేత కార్మికుల ర్యాలీ
పెద్దవడుగూరు: పెద్దవడుగూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా బుధవారం చేనేత కార్మిక సంఘం నాయకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని చౌడమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. రిలే నిరాహార దీక్షల్లో భాగంగా చేనేత కార్మిక సంఘం నాయకులు నాగరాజు, నారాయణస్వామి, రంగనాయకులు, చౌడయ్య, ఓబులేసు, ఆంజనేయులు, చింతారంగస్వామి, పెద్దరంగనాయకులు, జయరాముడు, భక్తాంజనేయులు, కరుణకుమార్‌లు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి న్యాయవాది చౌడేశ్వరయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు శేషంరాజు, నాగిరెడ్డి, వెంకటరామయ్యలు సంఘీభావం తెలిపారు. సాయంత్రం చేనేత కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ పురవీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామసుబ్బారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నారాయణస్వామి, నాగరాజు, సత్యనారాయణ, రామ్మోహన్‌యాదవ్, రాజు, హుసేనప్ప, రహంతుల్లా, కళాకారులు పెద్దయ్య, హరిబాబు, తలారి రామక్రిష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
యాడికిలో జనగర్జన విజయవంతం
యాడికి, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బుధవారం యాడికిలో జనగర్జన కార్యక్రమం జరిగింది. మండల జెఎసి అధ్యక్షులు కుమారస్వామి ఆధ్వర్యంలో జనగర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జెఎసి నాయకులు రంగారెడ్డి, చిన్నకొత్తపల్లి హెచ్‌ఎం లోకేశ్వర్‌రెడ్డి, తాడిపత్రి ఆర్టీసీ జెఎసి నాగభూషణం, ఐకెపి ఏపిఎం రామ్మూర్తి, ఇఓఆర్‌డి జిలాన్‌బాషా, ఎంఇఓ చిన్నపెద్దన్న, ఆర్‌ఐ ఆదినారాయణ, జనవిజ్ఞానిక రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు రజాక్, రవీంద్ర, వైకాపా నాయకులు బొంబాయ్ రమేష్‌నాయుడు, యాడికి సర్పంచ్ అనురాధ, జెపిడిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ హరినాథ్‌రెడ్డి, కులశేఖర్‌నాయుడులు పాల్గొన్నారు. ముందుగా జెసిడిఆర్ కళాశాల నుండి సమైక్యవాదులు, విద్యార్థులు 1200అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం, వైఎస్‌ఆర్ సర్కిల్, ఆర్యవైశ్య వీధి, లాలాల వీధి, సిండికేట్ బ్యాంక్, కోనరోడ్డు మీదుగా జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం జనగర్జన సభలో వందేమాతరం గీతం ఆలపించి సభ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సాగునీరు, తాగునీరు, విద్యా, ఉద్యోగ, వైద్య తదితర సమస్యలు తీవ్రంగా తలెత్తుతాయని తెలిపారు. సీమాంధ్రలో రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అవలంభించడం దారుణమన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. జనగర్జన సభలో సమైక్యాంధ్రకు మద్దతుగా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరులు కుండలు చేసి నిరసన వ్యక్తం చేశారు. విచిత్ర వేషాధారణలతో మండల కళాకారుల బృందం సభా కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో చిన్నారులు పాటలు పాడి, నృత్యాలు చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. జనగర్జన సభలో పాల్గొన్న ప్రజలకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై నిరంజన్‌రెడ్డి, పామిడి ఎస్సై మహానంది గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
విభజనతో రైతన్నకు తీరని నష్టం
అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 25: రాష్ట్రం విడిపోతే రైతాంగానికి తీరని నష్టం జరుగుతుందని సమైక్యాంధ్ర ఐక్య జెఎసి జిల్లా నాయకులు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని టవర్‌క్లాక్ సర్కిల్‌లో రైతు రంకె పేరుతో నిర్వహించిన సభకు భారీగా రైతులు తరలివచ్చారు. ఈ సభలో ఐక్య జెఎసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిఆర్వో హేమసాగర్, డిపిఆర్వో తిమ్మప్ప, ప్రిన్సిపల్ టి.రాజారాం, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల అధినేత అనంతరాములు, ఆదరణ రామకృష్ణ, కమర్షియల్ టాక్స్ అధికారి పద్మజ, పలువురు వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ అధికారులు, రైతులు ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల నదీ జలాల సమస్య కారణంగా జిల్లా రైతాంగానికి సాగునీటి సమస్య ఏర్పడుతుందని, తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి తల్లిగా భావించి, భూమినే నమ్ముకుని జీవించే రైతులు రాష్ట్ర విభజనను, తెలుగు ప్రజలను విడదీసే నిర్ణయాన్ని తిప్పికొట్టాలన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు రైతులు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎన్జీఓలు, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపారని, కోర్టు తాము ఉద్యమంలో పాల్గొనకుండా తీర్పు వెలువరించే పక్షంలో రైతులే గ్రామ గ్రామాన సమైక్య ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్నారు. రాజకీయ నేతలకు, పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన సమైక్య ఉద్యమ సాంస్కృతిక గీతాలు రైతుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు శివపురం భాస్కర్‌రెడ్డి, అవ్వారి అశోక్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
.................
రిమ్స్‌కు సమైక్యసెగ
ఆంధ్రభూమి బ్యూరో
కడప, సెప్టెంబర్ 25: కడపలోని రిమ్స్ వైద్యకళాశాలలో అధ్యాపకుల నియామకానికి బుధవారం జరగాల్సిన కౌనె్సలింగ్ ప్రారంభం కాకుండానే వాయిదా పడింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా మారిన మెడికల్ జెఎసి నేతలు ముందు నుండి చెబుతున్నా పట్టించుకోకపోవడంతో సమైక్యాంధ్ర జెఎసి నేతలతో కలిసి కౌనె్సలింగ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కౌనె్సలింగ్ చేపట్టిన అధికారులతో వాగ్వాదం జరిగింది. వైద్యాధికారులు దాదాపు గంట సేపు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో నిర్వాహకులు పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో కౌనె్సలింగ్ వాయిదా వేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ సిద్ధప్ప గౌర్ ప్రకటించారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగ వైద్యులు నిరాశతో వెనుతిరిగారు. దూరప్రాంతాల నుంచి ఎంతో శ్రమతో ఇక్కడకు చేరుకున్న మాకు అన్ని విధాల నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రిమ్స్ వైద్యకళాశాలలో 10 ప్రొఫెసర్ పోస్టులు, 35 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు, 20 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 9 ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా కాలంగా వీటిని భర్తీ చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనితో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుండగా మెడికల్ వార్డుకు చెందిన ప్రసాద్ అనే వైద్యుడు నర్సుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమేగాకుండా అసభ్య పదజాలంతో రోగుల ముందుర అవమానించాడని ఫిర్యాదు రావడంతో సమైకాంధ్ర ఉద్యమ వేడిలో ఉన్న ఉద్యమకారులు డైరెక్టర్ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. వైద్యునికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆయన ఉండే వార్డులోకి వెళ్లే ప్రసక్తేలేదని డైరెక్టర్‌కు మెడికల్ జెఎసి ప్రతినిథులు తెగేసి చెప్పారు. దీంతో డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఓబులేశును నియమించారు. విచారణలో వాస్తవాలను బట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో నర్సులు విధులకు వెళ్లారు. అధ్యాపకుల నియామక కౌనె్సలింగ్‌కు సమైక్యవాదులు అడ్డుపడుతున్నారని తెలిసి రిమ్స్ సిఐ నాయకుల నారాయణతో సహా భారీ సంఖ్యలో పోలీసులు డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జెఏసి వైద్యులు రమేష్ , ఓబులేశు, సురేశ్వరరెడ్డి, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్ధృతమవుతున్న సమైక్య సంగ్రామం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,సెప్టెంబర్ 25: వైఎస్సార్ జిల్లాలో రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు, ర్యాలీలు కొనసాగాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి దీక్షలు, నిరసనలు చేస్తున్న ఉపాధ్యాయ జెఏసి, సంబంధించిన నాయకులకు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా మంత్రి రామచంద్రయ్య ఇంటివద్దకు భారీ ఎత్తున ప్రైవేట్ విద్యాసంస్థలు జెఏసిలు, ఉపాధ్యాయ జేఏసి, ఎన్జీవో జెఏసిలు ర్యాలీగా వెల్లి ఇంటి ముందు కూర్చుని నిరసనలు తెలిపారు. అనంతరం రామచంద్రయ్య ఇంటికి 3టూలెట్2 బోర్డును ఇంటి బయటి గేటుకు తగిలించారు. అలాగే రామచంద్రయ్య వెంటనే రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో కలవాలని, లేకుంటే టులెట్ బోర్డు అలాగే ఉంటుందని వారు హెచ్చరించారు. అయితే విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ రంగనాయకులు విషయం తెలుసుకున్న వెంటనే ఉద్యమకారులకంటే ముందే మంత్రి ఇల్లు చేరుకోవడం విశేషం. అదేవిధంగా న్యాయవాదుల జెఏసి ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా న్యాయవాదులు రజకుల వేషంలో తమ వినూత్నరీతిలో సోనియాగాంధీ, కెసిఆర్ ,కోదండరామ్, షిండే, దిగ్విజయ్ ల బట్టలకు మాస్‌లు వేసి వారి బట్టలను ఉతికి ఆరేసి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంచకపోతే బట్టలు ఉతికినట్లే వారిని కూడా ఉతుకుతామని న్యాయవాదులు హెచ్చరించారు. అలాగే జిల్లాలోని ఆయా పట్టణాల్లో బాలికలు, మహిళలు కూడా దీక్షలకు కూర్చున్నవారికి ర్యాలీగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. అలాగే విద్యార్థులు వివిధ వేషాలతో నిరసనలు తెలుపుతూ సమైక్యవాదులను , ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జిల్లాలోని పులివెందుల సమైక్యాంధ్ర ఉద్యమం 57రోజులుగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్నారు. క్రీడాకారుల ర్యాలీలు, ధర్నాలు, నిరాహారదీక్షలతో పులివెందుల దద్దరిల్లుతోంది. పులివెందుల నియోజకవర్గం మండలాల్లో కూడా ఇదే విధమైన తీరులో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ముంపువాసుల మహాగర్జన , నెల్లూరు జిల్లానుంచి వచ్చిన కళాకారుల బృందం , నృత్యాలు పాటలతో పలువురిని ఆకర్షించాయి. అట్లూరు మండలంలో, పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరుకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కూడా సమైక్యాంధ్రాలో పాలుపంచుకుని నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే రాజంపేట, కోడూరు నియోజకవర్గాలో కూడా సమైక్యాంధ్రా నిరసనలు జోరుగా సాగింది. రాయచోటి నియోజకవర్గంలో కూడా రామాపురం , లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో కూడా రాష్ట్ర పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని గ్రామస్తులు, రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. జమ్మలమడుగు, పొద్దుటూరు, ముద్దనూరు, దువ్వూరు ప్రాంతాల్లో కూడా సమైక్యవాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. మొత్తంమీద జిల్లాలో సమైక్య ఉద్యమం ఉపాధ్యాయ జెఏసి, ఆర్టీసి జెఏసి, ఎపి ఎన్జీవో జెఏసిల ఆధ్వర్యంలో రోజురోజుకు ఉదృతవౌతోంది.
రాష్ట్రాన్ని విభజిస్తే సహించం
కడప (కలెక్టరేట్)/కడప (అర్బన్), సెప్టెంబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ జోలికివస్తే సహించేది లేదని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఎం యేస్రోం అన్నారు. రాష్ట్రం ముక్కలు కావడానికి బిజెపి, రెండు నాలుకల ధోరణి పార్టీలే కారణమన్నారు. యూపిఏ ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తుందన్నారు. తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పడంతో సోనియాగాంధీ తొందరపడి సీమాంధ్రకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రం విడిపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలన్నారు. వీరంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు డి దేవరాజు, వేంకటన్న, నగర కార్యదర్శి నాగేష్, రాజశేఖర్, తులసమ్మ, పద్మావతమ్మ, సుశీల, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర
సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రైవేట్ వృత్తికళాశాలల సమైక్య కన్వీనర్ కెఎస్‌ఎన్‌రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వృత్తికళాశాలల ఆధ్వర్యంలో గత 24 రోజులుగా స్థానిక కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం కందుల గ్రూపు, స్విస్ట్ గ్రూపుల ట్రాన్స్‌పోర్ట్ విభాగం 20 మంది దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కె ఎస్ ఎన్ మాట్లాడుతూ ఏ ఉద్యమంలో నైనా యువకులు, విద్యార్థులు పాల్గొంటేనే అనుకున్న లక్ష్మాన్ని చేరుకోవచ్చునన్నారు. నేటి యువతే రేపటి దేశా భవిష్యత్తుకు కారణమని తెలిపారు. ఇంత వరకు ఉద్యోగులు, సమైక్యవాదులు, మహిళలు, పిల్లలు మాత్రమే ఉద్యమంలో పాల్గొంటున్నారని సమైక్యాంధ్ర సాధించడం కోసం విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉద్యమం విఫలమైతే భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసిన వారతవుతామన్నారు. ఈ కార్యక్రమంలో కందుల, స్విస్ట్, గ్రూపుల ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది. వై గోపిరెడ్డి, ముని కుమార్,గంగాధర్, గంగరాజు, ఆంజనేయులు, సుబ్బారెడ్డి, నరసింహులు, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాలలో విద్వేషాలను, హింసకు తావు లేకుండా ఉద్యమకారులందరై సంయమనం పాటించాలని కడప డివిజన్ వాణిజ్య పన్నులశాఖ అధినేత ఎల్‌వి సుబ్బన్న పిలుపు నిచ్చారు. బుధవారం రిలే నిరాహారదీక్షలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలతోనే సమైక్యాంధ్రను సాధించుకోవాలన్నారు. ఈ దీక్షల్లో జి వెంకటసుబ్బయ్య, సివి నరసింహులు, బి రాజేష్, పి సుబ్బారెడ్డి, ఎం శ్రీకాంత్, డిసిటివోక్రిష్ణారెడ్డి, మేఘనాధ్, స్వరాజ్యలక్ష్మీ, రాజంపేట వాణిజ్య పన్నుల అధికారి హరీష్ కుమార్, ఏసిటివోలు సత్యనారాయణ, సింగన్న, రాముడు, వేణుగోపాల్, సునీతా, సీనియర్ అసిస్టెంట్లు ఎల్ జితేంద్ర, జూనియర్ అసిస్టెంట్లు రవికుమార్, నాగరాజు తదితరులు ప్రసంగించారు. .
మరింత ఉద్ధృతం చేయాలి
కడప వైస్సార్ జిల్లా ఉపాధ్యాయ సంఘం ముఖ్య నాయకుల సమావేశమై ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రూపొందించామని ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనర్ జివి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని అందరూ సమ్మెలోని ఉన్న ప్రైవేట్ కార్పొరేషఫన్ విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో మీ పిల్లలను చేర్పించండని, ప్రచారం చేయటుకు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమంలో విద్యార్థుల తల్లిదండ్రులను, రైతులను భాగస్వాములను చేయుటకు ప్రణాళిక రూపొందించామన్నారు. అక్టోబర్ 1 నుంచి ప్రతి రోజు ఉద్యమంలో మండల స్థాయిలో రోజుకు ఒక గ్రామం ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. గ్రామంలోని ఉపాధ్యాయులు పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్దేశాన్ని వివరించవసిందిగా తీర్మానించడమైందన్నారు. గడచిన 57 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్న జిల్లాలోని ఉపాధ్యాయులను అభినందిస్తూ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గురువారం ఉదయం రాయచోటిలో జరుగుతున్న సభకు ఉపాధ్యాయలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉపాధ్యా పోరాట సమితి కన్వీనర్ జివి నారాయణరెడ్డి, మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు నాగమునిరెడ్డి, ప్రత్యేక పాధ్యా సంఘం కార్యదర్శి వెంకట్రామిరెడ్డి ఎపిటిఎఫ్ కృష్ణారెడ్డి, ఎస్‌టియు సురేష్, ఆర్‌జెయుసి ఓబుల్‌రెడ్డి, ఎపియు ఎస్ సుబ్బరాయుడు, ఆర్‌యుపిపి బాల ఎల్లారెడ్డి, ఎయిడెడ్ గిల్ట్ శౌరిరెడ్డి, వైఎస్సార్ టియు శ్రీనివాసచౌదరి, ఎస్‌యుటి ఎ ఇక్బాల్, పిఆర్‌టియు వెంకటసుబ్బారెడ్డి, గురుకుల పాఠశాల సంఘం నాయకులు రాజు తదితరులు మాట్లాడారు.
కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు
యోగి వేమన విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో బుధవారం నాటికి 58 రోజులు చేరుకోగా కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి. వైవియూలో రోజుకు 30 మంది వరకు దీక్షలలో కూర్చుంటున్నారు. ఇప్పటి వరకు 900 మందికి పైగా రిలే నిరాహార దీక్షల్లో కూర్చుని తమ నిరసనలు తెలియచేశారు. విద్యార్థులు రోజుకొక వినూత్న పద్ధతిలో సమైక్యాంధ్ర ఉద్యమంపై నిరసనలు తెలియచేస్తు వస్తున్నారు. వైవియూ నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించడంతో జిల్లా వ్యాప్తంగా వైవియూలో చేపడుతున్న ఉద్యమాలకు కొత్తతనం వచ్చింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైవియూలోని గణిత విభాగానికి చెందిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి వెళ్లిపోండంటే
ఉతికి ఆరేస్తాం
కడప (లీగల్), సెప్టెంబర్ 25:బ్రిటీష్‌వారైనా వెళ్లారు కానీ సీమాంధ్రులు ఇప్పటికి కూడ హైదరాబాద్ నుంచి వెళ్లడం లేదు, తక్షణం వెళ్లిపోండి అనే ప్రకటనలు పునరావృతం అయితే ఉతికి ఆరేస్తామని అంటున్న న్యాయవాదులు బుధవారం జిల్లా కోర్టు ఎదుట సమైక్యాంధ్ర ప్రదేశ్‌కై చాకిరేవు కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాది పులికుంట ప్రమోద్‌కుమార్‌రెడ్డి, మహిళ న్యాయవాది ఎ ఉమాదేవిలు కోర్టు ఎదురుగా ఉన్న రహదారిపై బట్ట ఊతికి ఆరేస్తూ దోభీ వేషధారణలో నిరసనలు తెలిపారు. అలాగే లంగాను ఊతికి తాడుకు వేలాడదీసిన లంగాకు కెసిఆర్, కోదండరామ్, రాహుల్, సోనియా, దిగ్విజయ్‌సింగ్, హనుమంతరావు,జానారెడ్డి, అంటోనీ, చిదంబరం మాస్క్‌లు తగిలిచి తాడకు వేలాడు దీశారు. సీమాంధ్ర ప్రజలపై అనుచిత ప్రకటనలు ఎవ్వరు చేసినా చాకిరేవులో బట్టలు ఉతికి నట్లు ఊతికి ఆరేస్తామని ఆయన హెచ్చరించారు. 56వ రోజు న్యాయవాదులు నాగభూషణం, రమేష్, ఓబులరెడ్డి, నరసింహా, గుర్రప్పలతో పాటు ఉద్యోగులు వి శ్రీనివాసులు, పి శ్రీనివాసులు, ఆర్ నాగరాజు, ఎన్ చెన్నయ్య, పి పరమేశ్వరరావు, కె శ్రీదేవిలు దీక్షలో కూర్చున్నారు.
సమైక్య ప్రకటన వచ్చేవరకు ఉద్యమం
రాయచోటి, సెప్టెంబరు 25: తెలుగు జాతిని సమైక్యంగా ఉంచే వరకు రాజీలేని పోరాటం సాగిస్తామని జేఎసి నాయకులు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరాజు, మధన్‌మోహన్‌రెడ్డి, జనార్ధన్లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద బలిజ సంఘ నాయకులు రిలే దీక్షలో కూర్చున్నారు. జేఏసి నాయకులు సంఘీభావం తెల్పారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు గత కొద్ది రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులను, ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా వేర్పాటువాదులు ప్రవర్తిస్తున్నారని అలాంటి చేష్టలు విడనాడలని కోరారు. . హైదరాబాదు ఏ ఒకరి సొత్తుకాదని మూడు ప్రాంతాలకు చెందిన రాజధాని అని అన్నారు. అలాంటి రాజధానిపై అందరికి హక్కు ఉంటుందన్నారు. విభజన ప్రక్రియతో విద్యుత్, సాగునీరు సమస్య ఉత్పన్నమవుతుందని దీనితో ఇరు ప్రాంతాల మధ్య జలజగడం ఆరంభమవుతుందన్నారు. హైదరాబాదు కేంద్రంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు కార్పొరేట్ వైద్యం, విద్య కేంద్రీకరించబడిందని విభజనతో సీమ ప్రాంతంలో నిరుద్యోగ యువత, విధ్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆర్టీసీ జేఏసి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు గడ్డితింటూ బస్టాండ్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలో కుర్చున్నవారికి సంఘీభావం తెలిపారు. దీక్షలో బలిజ సంఘనాయకులు మంత్రి రెడ్డెయ్య, రాజారమేష్, నాగరాజు, శ్రీనివాసులు, భాస్కర్, సుధాకర్, హరిప్రతాప్, చంద్రశేఖర్, హరినాథ్‌బాబు, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, చిన్నరెడ్డెన్న, శివ, నాగభూషణం, ఆర్‌వి నారాయణ, ఆర్టీసీ జేఏసి నాయకులు ఏహియభాషా, రామ్మోహన్, పుల్లయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
వినూత్న రీతిలో సోనియాకు సందేశం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తెలంగాణ విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ తమ విధ్యా సంస్థల నేతృత్వంలో వినూత్న రీతిలో ఉద్యమం చేపడుతున్నట్లు రాజు విధ్యాసంస్థల అధినేత చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. బుధవారం తమ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా కొనసాగకపోతే ఉద్యోగ, ఉపాధి, తాగునీటి, తదితర అవకాశాలు లేక తమ భవిష్యత్ పూర్తిగా ఆంధకారమవుతొందన్న ఆందోళన నెలకొన్నందున వేలాది మంది విధ్యార్థులే బృందాలుగా ఏర్పడి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఆకాంక్షను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే నేరుగా తెలియజేసేలా సోనియాకే నేరుగా సందేశం పేరిట విద్యార్థులు తమ ఆకాంక్షతో కూడిన సందేశాన్ని పంపుతారన్నారు. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలవద్ద నుండి ఒక్క రూపాయిని వసూలుచేసి ఈ మొత్తాన్ని 10-జన్‌పథ్ చిరునామాకు సోనియాగాంధీకే నేరుగా చేరేలా వేలాదిగా వ్యక్తిగత మనియార్డర్లు పంపుతామన్నారు. మనియార్డర్లను పంపడంతో పాటు పంపే వ్యక్తులు తమ సందేశాన్ని, వినతి నేరుగా సోనియగాంధీకే చేరుతోందని తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామన్నారు. రెండో దశలో ఉద్యమకార్యాచరణలో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో రాయచోటి పట్టణం నుండి జిల్లా కేంద్రం వరకు విద్యా సంస్థలు పనిచేసే అధ్యాపకులు, విద్యార్థులు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్‌కు విన్నతులు సమర్పిస్తామన్నారు.
రణభేరిని విజయవంతం చేయండి
రాయచోటి, సెప్టెంబర్ 25: పట్టణంలోని జూనియర్ కళాశాలలో నేడు జరిగే రణభేరి సదస్సును విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య సంఘ జిలా