కడప, సెప్టెంబర్ 25: కడపలోని రిమ్స్ వైద్యకళాశాలలో అధ్యాపకుల నియామకానికి బుధవారం జరగాల్సిన కౌనె్సలింగ్ ప్రారంభం కాకుండానే వాయిదా పడింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా మారిన మెడికల్ జెఎసి నేతలు ముందు నుండి చెబుతున్నా పట్టించుకోకపోవడంతో సమైక్యాంధ్ర జెఎసి నేతలతో కలిసి కౌనె్సలింగ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కౌనె్సలింగ్ చేపట్టిన అధికారులతో వాగ్వాదం జరిగింది. వైద్యాధికారులు దాదాపు గంట సేపు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో నిర్వాహకులు పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో కౌనె్సలింగ్ వాయిదా వేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ సిద్ధప్ప గౌర్ ప్రకటించారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగ వైద్యులు నిరాశతో వెనుతిరిగారు. దూరప్రాంతాల నుంచి ఎంతో శ్రమతో ఇక్కడకు చేరుకున్న మాకు అన్ని విధాల నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రిమ్స్ వైద్యకళాశాలలో 10 ప్రొఫెసర్ పోస్టులు, 35 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు, 20 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 9 ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా కాలంగా వీటిని భర్తీ చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనితో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుండగా మెడికల్ వార్డుకు చెందిన ప్రసాద్ అనే వైద్యుడు నర్సుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమేగాకుండా అసభ్య పదజాలంతో రోగుల ముందుర అవమానించాడని ఫిర్యాదు రావడంతో సమైకాంధ్ర ఉద్యమ వేడిలో ఉన్న ఉద్యమకారులు డైరెక్టర్ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. వైద్యునికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆయన ఉండే వార్డులోకి వెళ్లే ప్రసక్తేలేదని డైరెక్టర్‌కు మెడికల్ జెఎసి ప్రతినిథులు తెగేసి చెప్పారు. దీంతో డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఓబులేశును నియమించారు. విచారణలో వాస్తవాలను బట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో నర్సులు విధులకు వెళ్లారు. అధ్యాపకుల నియామక కౌనె్సలింగ్‌కు సమైక్యవాదులు అడ్డుపడుతున్నారని తెలిసి రిమ్స్ సిఐ నాయకుల నారాయణతో సహా భారీ సంఖ్యలో పోలీసులు డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జెఏసి వైద్యులు రమేష్ , ఓబులేశు, సురేశ్వరరెడ్డి, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్ధృతమవుతున్న సమైక్య సంగ్రామం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,సెప్టెంబర్ 25: వైఎస్సార్ జిల్లాలో రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు, ర్యాలీలు కొనసాగాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి దీక్షలు, నిరసనలు చేస్తున్న ఉపాధ్యాయ జెఏసి, సంబంధించిన నాయకులకు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా మంత్రి రామచంద్రయ్య ఇంటివద్దకు భారీ ఎత్తున ప్రైవేట్ విద్యాసంస్థలు జెఏసిలు, ఉపాధ్యాయ జేఏసి, ఎన్జీవో జెఏసిలు ర్యాలీగా వెల్లి ఇంటి ముందు కూర్చుని నిరసనలు తెలిపారు. అనంతరం రామచంద్రయ్య ఇంటికి 3టూలెట్2 బోర్డును ఇంటి బయటి గేటుకు తగిలించారు. అలాగే రామచంద్రయ్య వెంటనే రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో కలవాలని, లేకుంటే టులెట్ బోర్డు అలాగే ఉంటుందని వారు హెచ్చరించారు. అయితే విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ రంగనాయకులు విషయం తెలుసుకున్న వెంటనే ఉద్యమకారులకంటే ముందే మంత్రి ఇల్లు చేరుకోవడం విశేషం. అదేవిధంగా న్యాయవాదుల జెఏసి ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా న్యాయవాదులు రజకుల వేషంలో తమ వినూత్నరీతిలో సోనియాగాంధీ, కెసిఆర్ ,కోదండరామ్, షిండే, దిగ్విజయ్ ల బట్టలకు మాస్‌లు వేసి వారి బట్టలను ఉతికి ఆరేసి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంచకపోతే బట్టలు ఉతికినట్లే వారిని కూడా ఉతుకుతామని న్యాయవాదులు హెచ్చరించారు. అలాగే జిల్లాలోని ఆయా పట్టణాల్లో బాలికలు, మహిళలు కూడా దీక్షలకు కూర్చున్నవారికి ర్యాలీగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. అలాగే విద్యార్థులు వివిధ వేషాలతో నిరసనలు తెలుపుతూ సమైక్యవాదులను , ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జిల్లాలోని పులివెందుల సమైక్యాంధ్ర ఉద్యమం 57రోజులుగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్నారు. క్రీడాకారుల ర్యాలీలు, ధర్నాలు, నిరాహారదీక్షలతో పులివెందుల దద్దరిల్లుతోంది. పులివెందుల నియోజకవర్గం మండలాల్లో కూడా ఇదే విధమైన తీరులో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ముంపువాసుల మహాగర్జన , నెల్లూరు జిల్లానుంచి వచ్చిన కళాకారుల బృందం , నృత్యాలు పాటలతో పలువురిని ఆకర్షించాయి. అట్లూరు మండలంలో, పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరుకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కూడా సమైక్యాంధ్రాలో పాలుపంచుకుని నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే రాజంపేట, కోడూరు నియోజకవర్గాలో కూడా సమైక్యాంధ్రా నిరసనలు జోరుగా సాగింది. రాయచోటి నియోజకవర్గంలో కూడా రామాపురం , లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో కూడా రాష్ట్ర పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని గ్రామస్తులు, రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. జమ్మలమడుగు, పొద్దుటూరు, ముద్దనూరు, దువ్వూరు ప్రాంతాల్లో కూడా సమైక్యవాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. మొత్తంమీద జిల్లాలో సమైక్య ఉద్యమం ఉపాధ్యాయ జెఏసి, ఆర్టీసి జెఏసి, ఎపి ఎన్జీవో జెఏసిల ఆధ్వర్యంలో రోజురోజుకు ఉదృతవౌతోంది.
రాష్ట్రాన్ని విభజిస్తే సహించం
కడప (కలెక్టరేట్)/కడప (అర్బన్), సెప్టెంబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ జోలికివస్తే సహించేది లేదని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఎం యేస్రోం అన్నారు. రాష్ట్రం ముక్కలు కావడానికి బిజెపి, రెండు నాలుకల ధోరణి పార్టీలే కారణమన్నారు. యూపిఏ ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తుందన్నారు. తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పడంతో సోనియాగాంధీ తొందరపడి సీమాంధ్రకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రం విడిపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలన్నారు. వీరంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు డి దేవరాజు, వేంకటన్న, నగర కార్యదర్శి నాగేష్, రాజశేఖర్, తులసమ్మ, పద్మావతమ్మ, సుశీల, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర
సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రైవేట్ వృత్తికళాశాలల సమైక్య కన్వీనర్ కెఎస్‌ఎన్‌రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వృత్తికళాశాలల ఆధ్వర్యంలో గత 24 రోజులుగా స్థానిక కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం కందుల గ్రూపు, స్విస్ట్ గ్రూపుల ట్రాన్స్‌పోర్ట్ విభాగం 20 మంది దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కె ఎస్ ఎన్ మాట్లాడుతూ ఏ ఉద్యమంలో నైనా యువకులు, విద్యార్థులు పాల్గొంటేనే అనుకున్న లక్ష్మాన్ని చేరుకోవచ్చునన్నారు. నేటి యువతే రేపటి దేశా భవిష్యత్తుకు కారణమని తెలిపారు. ఇంత వరకు ఉద్యోగులు, సమైక్యవాదులు, మహిళలు, పిల్లలు మాత్రమే ఉద్యమంలో పాల్గొంటున్నారని సమైక్యాంధ్ర సాధించడం కోసం విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉద్యమం విఫలమైతే భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసిన వారతవుతామన్నారు. ఈ కార్యక్రమంలో కందుల, స్విస్ట్, గ్రూపుల ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది. వై గోపిరెడ్డి, ముని కుమార్,గంగాధర్, గంగరాజు, ఆంజనేయులు, సుబ్బారెడ్డి, నరసింహులు, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాలలో విద్వేషాలను, హింసకు తావు లేకుండా ఉద్యమకారులందరై సంయమనం పాటించాలని కడప డివిజన్ వాణిజ్య పన్నులశాఖ అధినేత ఎల్‌వి సుబ్బన్న పిలుపు నిచ్చారు. బుధవారం రిలే నిరాహారదీక్షలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలతోనే సమైక్యాంధ్రను సాధించుకోవాలన్నారు. ఈ దీక్షల్లో జి వెంకటసుబ్బయ్య, సివి నరసింహులు, బి రాజేష్, పి సుబ్బారెడ్డి, ఎం శ్రీకాంత్, డిసిటివోక్రిష్ణారెడ్డి, మేఘనాధ్, స్వరాజ్యలక్ష్మీ, రాజంపేట వాణిజ్య పన్నుల అధికారి హరీష్ కుమార్, ఏసిటివోలు సత్యనారాయణ, సింగన్న, రాముడు, వేణుగోపాల్, సునీతా, సీనియర్ అసిస్టెంట్లు ఎల్ జితేంద్ర, జూనియర్ అసిస్టెంట్లు రవికుమార్, నాగరాజు తదితరులు ప్రసంగించారు. .
మరింత ఉద్ధృతం చేయాలి
కడప వైస్సార్ జిల్లా ఉపాధ్యాయ సంఘం ముఖ్య నాయకుల సమావేశమై ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రూపొందించామని ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనర్ జివి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని అందరూ సమ్మెలోని ఉన్న ప్రైవేట్ కార్పొరేషఫన్ విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో మీ పిల్లలను చేర్పించండని, ప్రచారం చేయటుకు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమంలో విద్యార్థుల తల్లిదండ్రులను, రైతులను భాగస్వాములను చేయుటకు ప్రణాళిక రూపొందించామన్నారు. అక్టోబర్ 1 నుంచి ప్రతి రోజు ఉద్యమంలో మండల స్థాయిలో రోజుకు ఒక గ్రామం ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. గ్రామంలోని ఉపాధ్యాయులు పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్దేశాన్ని వివరించవసిందిగా తీర్మానించడమైందన్నారు. గడచిన 57 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్న జిల్లాలోని ఉపాధ్యాయులను అభినందిస్తూ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గురువారం ఉదయం రాయచోటిలో జరుగుతున్న సభకు ఉపాధ్యాయలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉపాధ్యా పోరాట సమితి కన్వీనర్ జివి నారాయణరెడ్డి, మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు నాగమునిరెడ్డి, ప్రత్యేక పాధ్యా సంఘం కార్యదర్శి వెంకట్రామిరెడ్డి ఎపిటిఎఫ్ కృష్ణారెడ్డి, ఎస్‌టియు సురేష్, ఆర్‌జెయుసి ఓబుల్‌రెడ్డి, ఎపియు ఎస్ సుబ్బరాయుడు, ఆర్‌యుపిపి బాల ఎల్లారెడ్డి, ఎయిడెడ్ గిల్ట్ శౌరిరెడ్డి, వైఎస్సార్ టియు శ్రీనివాసచౌదరి, ఎస్‌యుటి ఎ ఇక్బాల్, పిఆర్‌టియు వెంకటసుబ్బారెడ్డి, గురుకుల పాఠశాల సంఘం నాయకులు రాజు తదితరులు మాట్లాడారు.
కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు
యోగి వేమన విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో బుధవారం నాటికి 58 రోజులు చేరుకోగా కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి. వైవియూలో రోజుకు 30 మంది వరకు దీక్షలలో కూర్చుంటున్నారు. ఇప్పటి వరకు 900 మందికి పైగా రిలే నిరాహార దీక్షల్లో కూర్చుని తమ నిరసనలు తెలియచేశారు. విద్యార్థులు రోజుకొక వినూత్న పద్ధతిలో సమైక్యాంధ్ర ఉద్యమంపై నిరసనలు తెలియచేస్తు వస్తున్నారు. వైవియూ నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించడంతో జిల్లా వ్యాప్తంగా వైవియూలో చేపడుతున్న ఉద్యమాలకు కొత్తతనం వచ్చింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైవియూలోని గణిత విభాగానికి చెందిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి వెళ్లిపోండంటే
ఉతికి ఆరేస్తాం
కడప (లీగల్), సెప్టెంబర్ 25:బ్రిటీష్‌వారైనా వెళ్లారు కానీ సీమాంధ్రులు ఇప్పటికి కూడ హైదరాబాద్ నుంచి వెళ్లడం లేదు, తక్షణం వెళ్లిపోండి అనే ప్రకటనలు పునరావృతం అయితే ఉతికి ఆరేస్తామని అంటున్న న్యాయవాదులు బుధవారం జిల్లా కోర్టు ఎదుట సమైక్యాంధ్ర ప్రదేశ్‌కై చాకిరేవు కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాది పులికుంట ప్రమోద్‌కుమార్‌రెడ్డి, మహిళ న్యాయవాది ఎ ఉమాదేవిలు కోర్టు ఎదురుగా ఉన్న రహదారిపై బట్ట ఊతికి ఆరేస్తూ దోభీ వేషధారణలో నిరసనలు తెలిపారు. అలాగే లంగాను ఊతికి తాడుకు వేలాడదీసిన లంగాకు కెసిఆర్, కోదండరామ్, రాహుల్, సోనియా, దిగ్విజయ్‌సింగ్, హనుమంతరావు,జానారెడ్డి, అంటోనీ, చిదంబరం మాస్క్‌లు తగిలిచి తాడకు వేలాడు దీశారు. సీమాంధ్ర ప్రజలపై అనుచిత ప్రకటనలు ఎవ్వరు చేసినా చాకిరేవులో బట్టలు ఉతికి నట్లు ఊతికి ఆరేస్తామని ఆయన హెచ్చరించారు. 56వ రోజు న్యాయవాదులు నాగభూషణం, రమేష్, ఓబులరెడ్డి, నరసింహా, గుర్రప్పలతో పాటు ఉద్యోగులు వి శ్రీనివాసులు, పి శ్రీనివాసులు, ఆర్ నాగరాజు, ఎన్ చెన్నయ్య, పి పరమేశ్వరరావు, కె శ్రీదేవిలు దీక్షలో కూర్చున్నారు.
సమైక్య ప్రకటన వచ్చేవరకు ఉద్యమం
రాయచోటి, సెప్టెంబరు 25: తెలుగు జాతిని సమైక్యంగా ఉంచే వరకు రాజీలేని పోరాటం సాగిస్తామని జేఎసి నాయకులు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరాజు, మధన్‌మోహన్‌రెడ్డి, జనార్ధన్లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద బలిజ సంఘ నాయకులు రిలే దీక్షలో కూర్చున్నారు. జేఏసి నాయకులు సంఘీభావం తెల్పారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు గత కొద్ది రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులను, ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా వేర్పాటువాదులు ప్రవర్తిస్తున్నారని అలాంటి చేష్టలు విడనాడలని కోరారు. . హైదరాబాదు ఏ ఒకరి సొత్తుకాదని మూడు ప్రాంతాలకు చెందిన రాజధాని అని అన్నారు. అలాంటి రాజధానిపై అందరికి హక్కు ఉంటుందన్నారు. విభజన ప్రక్రియతో విద్యుత్, సాగునీరు సమస్య ఉత్పన్నమవుతుందని దీనితో ఇరు ప్రాంతాల మధ్య జలజగడం ఆరంభమవుతుందన్నారు. హైదరాబాదు కేంద్రంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు కార్పొరేట్ వైద్యం, విద్య కేంద్రీకరించబడిందని విభజనతో సీమ ప్రాంతంలో నిరుద్యోగ యువత, విధ్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆర్టీసీ జేఏసి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు గడ్డితింటూ బస్టాండ్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలో కుర్చున్నవారికి సంఘీభావం తెలిపారు. దీక్షలో బలిజ సంఘనాయకులు మంత్రి రెడ్డెయ్య, రాజారమేష్, నాగరాజు, శ్రీనివాసులు, భాస్కర్, సుధాకర్, హరిప్రతాప్, చంద్రశేఖర్, హరినాథ్‌బాబు, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, చిన్నరెడ్డెన్న, శివ, నాగభూషణం, ఆర్‌వి నారాయణ, ఆర్టీసీ జేఏసి నాయకులు ఏహియభాషా, రామ్మోహన్, పుల్లయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
వినూత్న రీతిలో సోనియాకు సందేశం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తెలంగాణ విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ తమ విధ్యా సంస్థల నేతృత్వంలో వినూత్న రీతిలో ఉద్యమం చేపడుతున్నట్లు రాజు విధ్యాసంస్థల అధినేత చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. బుధవారం తమ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా కొనసాగకపోతే ఉద్యోగ, ఉపాధి, తాగునీటి, తదితర అవకాశాలు లేక తమ భవిష్యత్ పూర్తిగా ఆంధకారమవుతొందన్న ఆందోళన నెలకొన్నందున వేలాది మంది విధ్యార్థులే బృందాలుగా ఏర్పడి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఆకాంక్షను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే నేరుగా తెలియజేసేలా సోనియాకే నేరుగా సందేశం పేరిట విద్యార్థులు తమ ఆకాంక్షతో కూడిన సందేశాన్ని పంపుతారన్నారు. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలవద్ద నుండి ఒక్క రూపాయిని వసూలుచేసి ఈ మొత్తాన్ని 10-జన్‌పథ్ చిరునామాకు సోనియాగాంధీకే నేరుగా చేరేలా వేలాదిగా వ్యక్తిగత మనియార్డర్లు పంపుతామన్నారు. మనియార్డర్లను పంపడంతో పాటు పంపే వ్యక్తులు తమ సందేశాన్ని, వినతి నేరుగా సోనియగాంధీకే చేరుతోందని తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామన్నారు. రెండో దశలో ఉద్యమకార్యాచరణలో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో రాయచోటి పట్టణం నుండి జిల్లా కేంద్రం వరకు విద్యా సంస్థలు పనిచేసే అధ్యాపకులు, విద్యార్థులు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్‌కు విన్నతులు సమర్పిస్తామన్నారు.