న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ లభించటానికి ముందు రోజు ఆయన కుటుంబ సభ్యులు వివిధ బ్యాంకుల నుంచి 12 వందల కోట్ల రూపాయలు విత్‌డ్రా చేశారని టిడిపి నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. బినామీ పేర్లతో ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేశారని శుక్రవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో అన్నారు. ఈ మొత్తాన్ని ఎవరు ఏయే బ్యాంకుల నుంచి తీశారు? ఈ సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్లింది? అన్న విషయమై ఆర్‌బిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రూ.1,200 కోట్ల విత్‌డ్రాకు సంబంధించి సాక్ష్యాలు తమవద్ద ఉన్నాయని గాలి చెప్పుకొచ్చారు. అధికారం, సీట్ల కోసం జగన్‌ను జైలు నుంచి విడిపించేందుకు కాంగ్రెస్, వైకాపాల మధ్య చీకటి ఒప్పందాలు కుదిరాయని ఆరోపించారు. ఇదే కేసులో జైలులో ఉన్న వారికి వదిలేసి ఒక్క జగన్‌కే బెయిల్ ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలే ప్రధానమని గాలి అన్నారు. జంతర్‌మంతర్‌లో సచివాలయ ఉద్యోగుల ధర్నాలో మాట్లాడిన విజయమ్మ రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబు ఇచ్చిన లేఖే కారణమని చెప్పడం విడ్టూరంగా ఉందన్నారు.
రాహుల్‌కు విజయమ్మ కృతజ్ఞతలు
జగన్‌కు బెయిల్ లభించినందుకు విజయమ్మ కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారని టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆరోపించారు. సీమాంధ్ర సచివాలయం ఉద్యోగులు ధర్నాకు హాజరుకావటానికి ముందు విజయమ్మ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితోకలిసి ఒక హోటల్‌లో రాహుల్ గాంధీని కలిశారని, ఈ సమావేశం లోడీ హోటల్‌లో జరిగిందన్నారు. తాము రాహుల్‌ను కలవలేదని ఖండించాలని విజయమ్మను ఆయన డిమాండ్ చేశారు. జగన్‌కు బెయిల్ రాకముందు విజయమ్మ, భారతి అనేక సార్లు ఢిల్లీ వచ్చి అహ్మద్ పటేల్‌తో సమావేశమైనట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయన్నారు. టిఆర్‌ఎస్, వైఎస్సార్ సిపితో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఆరోపించిన టిడిపి
english title:
o
Date:
Saturday, September 28, 2013