న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కును భారత పౌరులకు కట్టబెడుతూ సుప్రీం కోర్టు జారీ చేసిన చారిత్రక తీర్పు అమలులోకి వస్తే ఈ తరహా విధానాన్ని ఆచరణలో పెట్టిన 14వ దేశంగా భారత్ కీర్తిని అందుకుంటుంది. ఇప్పటి వరకూ 13 దేశాల్లో నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కును అమలు చేస్తున్నారు. అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఓటర్లకు కల్పించడం వల్ల రాజకీయ పార్టీలు మరింతగా అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుందని ఆ విధంగా సరైన అభ్యర్థులే రంగంలోకి దిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నీతి, నిజాయితీ, రుజువర్తన కలిగిన అభ్యర్థులనే రాజకీయ పార్టీలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఓటర్ల జాబితాలో ‘నన్ ఆఫ్ ది ఎబౌవ్’ అన్న పదాన్ని కూడా చేరుస్తారు. ప్రస్తుతం ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రేయిన్, చిలీ, బంగ్లాదేశ్, నెవాడ, ఫిన్లాండ్, అమెరికా, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ఈ తిరస్కార హక్కు అమలులో ఉంది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కును
english title:
t
Date:
Saturday, September 28, 2013