Clik here to view.

‘z’ ఈ అక్షరం వర్ణవాలలో 26వది. చివరిది. ఈ అక్షరం వాక్కును అదుపులో వుంచే శక్తిని ఇస్తుంది. ఈ అక్షరంలో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తులు తెలివిగా, జాగ్రత్తగా, నమ్మకం కలిగే విధంగా మాట్లాడే శక్తి కలిగి వుంటారు.
వీరు డైనమిక్‌గా, ఆశావాద దృక్పథం కలిగి వుంటారు. వీరికి గొప్ప ఆశయాలు వున్నా ప్రాక్టికల్‌గా వుంటారు. కష్టకాలంలో కూడా ప్రయత్నాలు కొనసాగిస్తారు. దానివలన చాలా గుర్తింపు పొందుతారు.
వీరికి అధికారం, విలాసాలపట్ల ఆసక్తి వుంటుంది. మంత్ర తంత్ర శాస్త్రాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. వీరు తమ వాక్చాతుర్యంతో పనులు సాధిస్తారు. ఈ అక్షరం స్వార్థాన్ని సూచిస్తుంది.
వీరు చురుకైన బుద్ధి కలిగి వెంటనే ప్రతిస్పందించగలరు. వీరు మధ్యవర్తిత్వం నెరపగలుగుతారు. ఈ అక్షరం పేరులో ఎక్కువసార్లు వస్తే నిద్రలేమి కలుగుతుంది.
*
జన్మదినం -2.. సంఖ్య-2
చంద్రునికి చిహ్నం. ఈ తేదీన జన్మించిన వారు వాత్సల్య పూరితంగా ఉంటారు. సున్నిత మనస్తత్వం. ఎమోషన్స్ కలిగి తొందరగా గాయపడే హృదయం కలిగి ఉంటారు. వ్యతిరేక దృక్పథం కలిగిన వ్యక్తులకు వీరు దూరంగా ఉంటే మంచిది. వీరు చాకచక్యం, సహకార గుణం కలిగి ఉంటారు. ఊహాశక్తి కలిగి ఉన్నా, అవాస్తవికతలో ఉంటారు. అందమైన వస్తువులను ఇష్టపడతారు. వీరి సర్దుకుపోయే గుణం వలన వీరికి మంచి స్నేహితులు ఉంటారు.
వీరు ప్రేమ, వాత్సల్యం కోరుకుంటారు. శాంతిని కలిగించి వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు బాగా నెరపగలుగుతారు. ప్రయాణాలు, సంగీతం, కళల పట్ల అభిరుచి కలిగి ఉంటారు. వీరు తెలివైన వారైనప్పటికీ, తమని తాము తక్కువ అంచనా వేసుకుంటారు. ప్రశాంత వాతావరణంలో వీరు బాగా రాణిస్తారు. వీరు రాజకీయ వేత్తలుగా, విశే్లషకులుగా, సంగీత కారులుగా, నటులు, రచయితలుగా రాణించగలుగుతారు.
వీరు, శాంతి, సహకారం, మధ్యవర్తిత్వం నెలకొల్ప గలుగుతారు. వీరు నాయకులు కాలేరు గాని మంచి అనుచరులుగా ఉండగలరు. వీరు వినయ విధేయతలు కలిగి, తగవులమారిగా ఉండరు. నాయకత్వం అవసరం లేనిచోట ఎక్కడైనా వీరు విజయం సాధిస్తారు.
వీరు రేడియో, టీవీ, వైద్యం, బోధన, బ్యాంకింగ్, సంగీతం, నటన.. మొదలైన వాటిలో కూడా రాణిస్తారు. విచారకర వాతావరణంలో ప్రశాంతతను నెలకొల్పటంలో వీరు నేర్పరులు.
వీరు మంచి భాగస్వాములుగా ఉండగలుగుతారు. జాలి, దయ కలిగి, అర్థం చేసుకొనే మనసు కలిగి ఉంటారు. విశ్వసనీయత, విశ్వాసపాత్రత కలిగి ఉంటారు. వీరికి సృజనాత్మకత శక్తి ఉంటుంది. చంద్ర ప్రభావంవలన ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులు అలంకరిస్తారు. ఇతరులు శ్రమపడి సాధించలేనిది వీరు సులభంగా చేయగలుగుతారు. వీరు మాటలలో ధైర్యం చూపించినా, మనసులో ఏదోమూల భయం ఉంటుంది.
వీరికి అనుకూలమైన సంఖ్య గలవారితో పని చేస్తే విజయం సాధిస్తారు. కల్పనల ద్వారా సంపాదన చేయగలరు.
వీరు ఈ కింది గుణాలను వదిలించుకుంటే మంచిది.
1.కేవలం ఊహలపై ఆధారపడటం
2.ఆత్మన్యూనతా భావం
3.ప్రతి చిన్న విషయానికి చిన్నబుచ్చుకోవటం
4.పిరికితనం, సిగ్గు
5.అతిభావావేశం
6.ఇతరుల సంతోషం కోసం, తమ ఆత్మాభిమానం దెబ్బతిన్నా సహించటం.
*
చిరునామా: మహమ్మద్ దావూద్
8-3-825/5/3/6/3, సుభాష్ నగర్, యల్లారెడ్డిగూడ, హైదరాబాద్.