హైదరాబాద్, నవంబర్
18: దేశవ్యాప్తంగా
పర్యటించడానికి తనకు
అనుమతి ఇవ్వాలని
కోరుతూ వైకాపా
అధ్యక్షుడు
జగన్మోహన్‌రెడ్డి వేసిన
పిటిషన్‌ను సిబిఐ కోర్టు
సోమవారం కొట్టివేసింది.
దేశ వ్యాప్తంగా పర్యటించి
వివిధ రాజకీయ పార్టీల
నాయకులను
కలుసుకోవాలనే
ఉద్దేశంతో జగన్ పిటీషన్
దాఖలు చేశారు. తొలుత
కలకత్తా వెళ్లి తృణముల్
కాంగ్రెస్ అధ్యక్షురాలు
మమతా బెనర్జీని
కలుసుకోవాలని
నిర్ణయించుకున్నారు.
అయితే పార్లమెంటు
సభ్యునిగా ఢిల్లీ వెళ్లడానికి
మాత్రమే అనుమతి
ఇచ్చిన కోర్టు ఇతర
రాష్ట్రాల్లో పర్యటనలకు
అనుమతి ఇవ్వలేదు.
జగన్ వివిధ రాష్ట్రాల్లో
పర్యటించేందుకు
అనుమతి ఇస్తే కేసు
విచారణపై ప్రభావం
పడుతుందని సిబిఐ
అభ్యంతరం వ్యక్తం
చేయడంతో సిబిఐ కోర్టు
పిటీషన్‌ను కొట్టివేసింది.
ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లి
సిపిఐ, సిపిఎం, బిజెపి
జాతీయ నాయకులను
కలిసి సమైక్యాంధ్రకు
మద్దతు ఇవ్వాలని కోరిన
విషయం తెలిసిందే. అదే
విధంగా వివిధ రాష్ట్రాల్లో
పర్యటించాలని జగన్
భావించారు.