చాంద్రాయణగుట్ట, నవంబర్ 18: పాఠాలు నేర్పాల్సిన గురువే విద్యార్థినుల పట్ల అపర కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురి చేయటమేగాక, విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా తెలిసిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యోగేశ్వర్రావు(56) అనే ప్రిన్సిపాల్ వికాస్ భారతి హై స్కూల్‌ను నిర్వహిస్తున్నాడు. స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని(14)పై గడిచిన మూడు, నాలుగు రోజుల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా బాధితురాలైన విద్యార్థినిని నీవు బలహీనంగా ఉన్నావంటూ, స్కూల్ అయిపోన తర్వాత కూడా ఓ తరగతి గదిలోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అంతేగాక, పలు సార్లు లైంగికంగా వేధింపులకు కూడా పాల్పడినట్లు విద్యార్థిని సోమవారం తన తల్లిదండ్రులకు తెలపటంతో విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పాఠాలు నేర్పాల్సిన గురువే విద్యార్థినుల పట్ల అపర
english title:
sexual abuse
Date:
Tuesday, November 19, 2013