నార్సింగి, నవంబర్ 18: ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదం చివరకు ఇరువర్గాల నడుమ ఉద్రిక్తతకు దారితీసింది. ఆసిఫ్‌నగర్ ఇన్స్‌పెక్టర్ జె.నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మురాద్‌నగర్‌లోని జెబాబాగ్‌లో రక్తమైసమ్మ దేవాలయం వద్ధ ఆదివారం రాత్రి ఇద్దరు మిత్రులు అదే ప్రాంతానికి చెందిన మెహిదీపట్నంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న రషీద్, సమీపంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న శ్రీకాంత్ అనే ఇద్దరు కలిసి దేవాలయం వద్ద మద్యం సేవిస్తున్నారు. కాగా, ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా వచ్చింది. చివరికి ఇది రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఓ వర్గం దేవాలయంపై రాళ్లు రువ్వటంతో అలజడి ప్రారంభమైంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెంటనే భారీగా పోలీసులను మొహరించి అక్కడ ఉన్న ఇరువర్గాలకు చెందినవారిని తరిమివేశారు. తమ వర్గానికి చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారని స్థానిక ఎమ్మెల్యే కూడా సంఘటన స్థలానికి వచ్చి, పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఇరువురు గొడవ పడితే తప్పలేదు గాని, దేవాలయంపై ఓ వర్గం రాళ్లు రువ్వడం ఏమిటని మరో వర్గంవారు పోలీసులను నిలదీశారు. ఇరువర్గల వారిని పోలీసులు సముదాయించినా, చాలా సేపు వరకు పరిస్థితి అదుపుకాకపోవటంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. పశ్చిమ మండల అదనపు డిసిపి నాగరాజు మాట్లాడుతూ గొడవకు దారితీసిన అంశాలు పూర్తిగా అందలేదని, దేవాలయంపై రాళ్లు రువ్వున వారిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జెబాబాగ్‌లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని డిసిపి పేర్కొన్నారు. ఇంకా ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని కూడా తెలిపారు.
-- ఉద్రిక్తతకు దారితీసిన స్వల్ప వివాదం * భారీగా మోహరించిన పోలీసులు --
english title:
police
Date:
Tuesday, November 19, 2013