హైదరాబాద్, నవంబర్ 18: ఉద్యోగులు ప్రజలకు నిరంతరం సేవలందించడంలో ఆదర్శ పాలకులని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా తెలంగాణ నాన్‌గెజిటెడ్ యూనియన్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అందించడంలో వీరి పాత్ర ప్రశంసనీయమన్నారు. సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు సమ్మె చేసిన ఉద్యోగుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. వికారాబాద్‌లో ఉద్యోగుల భవనానికి 2లక్షల నిధులు మంజూరు చేయడంతో పాటు జిల్లాలో పనిచేస్తున్న 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యేక అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ జిల్లాకు అతి ప్రాముఖ్యత ఉందని, జిల్లాలో పనిచేయడం సిబ్బందికి కష్టతరంగానే ఉంటుందని తెలిపారు. దీన్ని అధిగమించుటకు కొత్తగా వచ్చే ఉద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు సిబ్బంది కొరత తీర్చుటకు నియామకాలు లేనందున బ్యాక్‌లాగ్ నియామకాలను, వికలాంగుల నియామకాలను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవి ప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ కొద్దిరోజుల క్రితమే హెల్త్‌కార్డుల నిమిత్తం జిఓ 175, 176 విడుదల చేసినప్పటికీ అందులో కొన్ని లొసుగులున్నాయని వాటిని పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంవి రెడ్డి, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, గెజిటెడ్ సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టిఎన్‌జివో అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి రామ్మోహన్, జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రశంస
english title:
prasada kumar
Date:
Tuesday, November 19, 2013