కీసర, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తికావచ్చిందని, ఎలాంటి షరతులు లేని పది జిల్లాల రాష్ట్రం కావాలని టిఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ, వెయ్యిమంది త్యాగాలు వృధా కావని, కాంగ్రెస్‌లో టిఆర్ఎస్ విలీనం ప్రసక్తేలేదని, సీమాంధ్రలో ఎన్ని ఉద్యమాలు వచ్చినా రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని అన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా మాట్లాడటం సరికాదన్నారు. సమావేశంలో మేడ్చల్ ఇన్చార్జి ఎం.సుధీర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రవికాంత్, తిమ్మాయిపల్లి సర్పంచ్ రాజలింగంగౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తికావచ్చిందని, ఎలాంటి షరతులు లేని
english title:
telangana
Date:
Tuesday, November 19, 2013