హైదరాబాద్, నవంబర్ 18: ప్రభుత్వం అమలుపర్చే వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కళా బృందాల పాత్ర కీలకమని, తమ పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సమాచార సంగీత నాటక విభాగం సహాయ సంచాలకులు శ్రీనివాస్ జీవన్ తెలిపారు. రంగారెడ్డిజిల్లా సంగీత నాటక కళా బృందాలకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని క్షేత్ర స్థాయిలో వాటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రంగారెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎం.రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై తొలుత కళాబృందాలకు అవగాహన, స్పష్టత కలిగి ఉండాలని అట్టి అవగాహన కల్పించడానికే శిక్షణ శిభిరం ధ్యేయమని తెలిపారు. పల్లెసుద్దులు, వీధినాటకం, చిందు యాక్షగానం, జానపదం వంటి కళారూపాలపై కొన్ని బృందాలకు శిక్షణనిప్పించి మాస్టర్ ట్రైనీ బృందాల ద్వారా జిల్లాలోని అన్ని బృందాలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం అమలుపర్చే వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కళా బృందాల పాత్ర
english title:
kala
Date:
Tuesday, November 19, 2013