మక్కువ, నవంబర్ 19: ఉత్తరాంధ్ర కల్పవల్లి శంబరపోలమాంబ జాతర తేదీలను ఖరారు చేస్తున్నట్లు దేవదాయశాఖ ఇ.ఒ నాగార్జున తెలియజేశారు. మంగళవారం శంబర గ్రామంలో మాజీ కమిటీ చైర్మన్‌లు గ్రామపెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలను డిసెంబర్ 23, 2013న శంబర పెదపోలమాంబ అమ్మవారిని తెచ్చుటకు చాటింపు దండోర వేయిస్తామన్నారు. డిసెంబర్ 30, 2013న పెద అమ్మవారిని కొనితెచ్చినట్లు తెలియజేశారు. 30 డిసెంబర్, 2013 నుండి జనవరి 7, 2014వరకు సాంస్కృతిక కార్యక్రమాలు , జనవరి 8, 2014న పెద అమ్మవారి అంబకోత్సవం, అదేరోజు శంబర పోలమాంబను తెచ్చుటకు చాటింపు వేస్తామన్నారు. జనవరి 13, 2014న చినపోలమాంబ తెచ్చుటకు నిర్ణయించామన్నారు. జనవరి 27, 2014సోమవారం తొలేళ్ల ఉత్సవం, జనవరి 28, 2014 మంగళవారం సిరిమానోత్సవం, జనవరి 29, 2014 అంపకోత్సవం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 4, 2014న మారుజాతర నిర్వహిస్తారని తెలియజేశారు. పండుగకమిటీ నెలరోజుల పాటు ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరుతున్నట్లు పివో నాగార్జున తెలియజేశారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి శంబరపోలమాంబ జాతర తేదీలను ఖరారు
english title:
shambara
Date:
Wednesday, November 20, 2013