బొబ్బిలి, నవంబర్ 19: జిల్లాలో 1.2 లక్షల మంది కార్మికులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎస్‌డివి ప్రసాద్ తెలిపారు. స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 8వేల మంది కార్మికులు మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.కార్మికశాఖ ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలు రాయితీలు అందించాలంటే తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. జాతీయ నిర్మాణ మండలి, కార్మిక శాఖ సంయుక్తంగా కార్మికులకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. వీటి ద్వారా కార్మికులు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే అవకాశం ఉందన్నారు. కార్మికుల కుటుంబానికి ప్రసూతి సహాయం కింద ఇంతవరకు 5వేల రూపాయిలు ఇచ్చేవారని ప్రస్తుతం 10 వేల రూపాయిలకు పెంచారని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
విజయనగరం , నవంబర్ 19: సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ మధ్యాహ్న భోజన విరామసమయంలో డిపో ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ డిపో కమిటీ అధ్యక్షుడు డిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తోందన్నారు. ముఖ్యంగా కార్మికులకు రుణాలు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందన్నారు.
జిల్లాలో 1.2 లక్షల మంది కార్మికులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన
english title:
workers
Date:
Wednesday, November 20, 2013