విజయనగరం, నవంబర్ 19: రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పట్టణంలోని కాటవీధి, దాసన్నపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సమర్ధవంతమైన పాలనకు ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం హయాంలో పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని విడమరిచారు. అలాగే టిడిపి అధికారంలోకి వస్తే పేదలకు, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామో వివరించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు కానరావడం లేదన్నారు. అవినీతే తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, ఎస్ఎన్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు
english title:
ashok
Date:
Wednesday, November 20, 2013