హైదరాబాద్, నార్సింగి, నవంబర్ 20: బ్రాండెడ్ బంగారు నగల షాపులను ఎంపిక చేసుకుని పెద్దమొత్తంలో నగలు కొనుగోలు చేసి, ‘చెక్’లిచ్చి బిల్లు ఎగ్గొడుతున్న బావా, బావమరిదిలిద్దర్ని టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 34తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వినియోగిస్తున్న 22 డెబిట్ కార్డులు, మరో 22 వివిధ బ్యాంక్‌లకు చెందిన చెక్ బుక్కులను, సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్సు పోలీసుల కథనం ప్రకారం నంద్యాల వాస్తవ్యులైన భవన్సీ ప్రసాద్ కుమార్ ప్రస్తుతం నగరంలోని అమీర్‌పేటలో నివాసముంటున్నాడు. అలాగే అతని బావమరిది ప్రకాశం జిల్లాకు చెందిన వట్టి హరికృష్ణ కూడా నగరంలోని మెట్టుగూడలో నివాసముంటున్నాడు. వీరిద్దరు ఓ ముఠాగా ఏర్పడి పేరుగాంచిన పెద్ద పెద్ద జ్యుయెలరీ షాపులను టార్గెట్ చేసుకుని పెద్ద మొత్తంలో బంగారునగలను కొనుగోలు చేసి, బిల్లు మొత్తంలో నామమాత్రంగా కొండ డబ్బును నగదు చెల్లించి, పెద్ద మొత్తంలో డబ్బుకు చెక్‌లు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. వీరిచ్చిన చెక్‌లను బ్యాంక్‌లో వేయగా తగినంత సొమ్ము లేకపోవటంతో అవి బౌన్స్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో వీరి చేతిలో మోసపోయిన పది మంది బాధితులు టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారమివ్వటంతో వీరిపై నిఘాను ఏర్పాటు చేసిన పోలీసులు వీరు బుధవారం పంజాగుట్టలోని రతన్‌సింగ్ జ్యుయెలరీ షాపులో బంగారు నగలను కొనుగోలు చేస్తుండగా టాస్క్ఫోర్సు పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో వీరు ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ నారాయణగూడ పోలీసులకు చిక్కగా, వారు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఏడాది క్రితమే బెయిల్‌పై విడుదలైన ఈ ఇద్దరు బావా, బావమరిదిలు నగరంలోని మరో 22 పేరుగాంచిన బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి చెక్ బుక్‌లను తీసుకుని మళ్లీ అదే తరహాలో మోసాలకు పాల్పడుతూ ఇప్పటి వరకు మొత్తం 60 మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి చేతిలో మోసపోయిన పది మంది వివరాలు బయటకు రాగా, మరో యాభై మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన టాస్క్ఫోర్సు పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం వీరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
* 34 తులాల బంగారం స్వాధీనం
english title:
v
Date:
Thursday, November 21, 2013