హైదరాబాద్, నవంబర్ 20: ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలు క్షుణ్నంగా పరిశీలించి మార్పులు చేర్పులేమైనా ఉంటే తెలిపి జాబితాను సమగ్రంగా రూపొందించేందుకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర హస్తకళల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజారామయ్యార్ సూచించారు. రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని, అందుకే ముసాయిదా జాబితా పరిశీలనపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
2014 ఎన్నికల సంవత్సరం కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనలను సరళతరం చేసిందన్నారు.
జనవరి 1,2014 నాటికి 18సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని ఈ అంశంపై రాజకీయ పార్టీలు చొరవ తీసుకొని వారి ప్రాంతాల్లో అర్హులను నమోదు చేయించాలని కోరారు.
త్వరగా బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ ఓటర్లజాబితా పరిశీలనకు ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రభుత్వం ఎలక్షన్ రోల్ అబ్జర్వర్లుగా నియమించిందని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా జాబితాను ఈ నెల 18నే ప్రచురించామని చెప్పారు. 18నుండి డిసెంబర్ వరకూ ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు.
- ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ రామయ్యార్ -
english title:
o
Date:
Thursday, November 21, 2013