Clik here to view.

నటీనటుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుందని కత్రీనా కైఫ్ అంటోంది. దీపికా పడుకొనే ‘రామ్-లీలా’తో హ్యాట్రిక్ సాధించడంపై స్పందిస్తూ, బాలీవుడ్‌లో తన కెరీర్ కూడా ఎంతో సంతృప్తికరంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. తాను ఆశించినదానికంటే భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని, ఇంతవరకూ సినీ పరిశ్రమలో తనకెలాంటి విచారకర పరిస్థితులు ఎదురుకాలేదని కత్రీనా సంబరపడుతోంది. మంచి పోటీ ఉంటే వృత్తిపరంగా నైపుణ్యం సాధించవచ్చని, దీపికాకు వరుసగా మూడు హిట్లు దక్కడంపై తనలో ఎలాంటి వ్యతిరేక భావాలు లేవంటోంది. ప్రతి సినిమా తనకు ఓ సవాల్ వంటిదని, ఇతరుల విజయాలను చూసి బాధ పడాల్సిన అవసరం తనకు లేదని తెగేసి చెబుతోంది. అమీర్ ఖాన్‌తో తాను కలిసి నటించిన ‘్ధమ్ 3’ ఘన విజయం సాధిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని కత్రీనా వ్యక్తం చేసింది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో నిర్మించిన ‘్ధమ్ 3’ డిసెంబర్ 20న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
*