భీమవరం, మార్చి 5: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో సిఫి అంతర్జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ మెయిన్‌డ్రా పోటీల్లో తొలి రోజైన సోమవారం భారత్ ఆటగాళ్లు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రాణించారు. సింగిల్స్ విభాగంలో జీవన్ నెదుంచిజియాన్ (్భరత్) కెప్లెర్మార్క్ అలెగ్జాండర్ (జర్మనీ)పై 6-2, 7-5 స్కోరుతో వరుస సెట్లలో విజయం సాధించాడు. మ్యాథూ వియరిన్ (ఇటలీ) ఎన్.విజయసుందర్ (్భరత్)పై 6-3, 4-6, 6-3, వివేక్ షౌకిన్ (్భరత్) సురేష్‌కృష్ణ (్భరత్)పై 7-6, 6-3 తేడాతో విజయం సాధించారు. జోర్డీమొనోజ్ అబెరూ (స్పెయిన్) 1-6, 6-2, 6-1 సెట్ల తేడాతో బ్రిటన్‌కు చెందిన మైల్స్బుబీపై విజయం సాధించాడు. డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన రోహన్ గజ్జర్, సాకెత్ జోడీ కిటా (జపాన్), రెనార్డ్ (స్వీడన్) జంటపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించారు. చంద్రిల్సూడ్, లక్షిత్సూడ్ (్భరత్) జోడీ మహమ్మద్ అషఫ్,్ర గుగాన్ (్భరత్)పై 6-0, 6-3 స్కోరుతో విజయం సాధించారు.
రూపేష్రాజ్ (్భరత్), అజీద్ తివారి (్భరత్) జోడీ మైక్బర్లేజ్ (జర్మనీ), మార్క్ అలెగ్జాండర్ కెప్లెర్ (జర్మనీ)పై 3-6, 7-6(8), 10-2 తేడాతో విజయం సాధించారు. ఈ నెల 10వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి.