కొందరికి గుండె కొట్టుకోవటం స్తంభించిపోయి పట్టేసినట్లవుతోంది. ఇలా గుండె స్తంభించిపోయినపుడు ఎక్కువమంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈవిధంగా జరిగినపుడు వెంటనే వారికి హృదయం, ఊపిరితిత్తుల పునర్జీవన చర్య (సీపిఆర్)చేస్తే రోగికి బతికే అవకాశాలున్నాయని ఇటీవల జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇలాంటివారికి 38 నిముషాల పాటు సీపీఆర్ చేస్తే రోగి బతుకుతాడు. జపాన్‌లో 2005-11 మధ్యకాలంలో గుండె స్తంభించిన కొందరిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో గుండె ఆగి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించిన వారిలో ఆ వ్యవధి ఎంతసేపు వుంది అనేదాని ఆధారంగా అది వారి మెదడు పనితీరుపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేశారు. వీరి అధ్యయనం వల్ల 38 నిముషాలు అంతకంటే ఎక్కువ సేపు సీపీఆర్ చేస్తే ఎంతో మంచిదని టోక్యోలోని సీపీఆర్-కార్డియో వాస్కులర్ కేర్ వైద్యులు కెన్ నగావో అంటున్నారు.
కొందరికి గుండె కొట్టుకోవటం స్తంభించిపోయి పట్టేసినట్లవుతోంది.
english title:
idia
Date:
Wednesday, November 27, 2013