మూడేళ్ళక్రితం, భారతీయ పబ్లిషింగ్ రంగంలో ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదించిన వ్యక్తి, కెనడాలో తన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చేశారు! అంత అకస్మాత్తుగా ఆయన తన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు ఎందుకు తిరిగిరావాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ఆయన పనిచేసిన కంపెనీ అప్పట్లో విడుదల చేసిన ప్రకటనే సమాధానం చెప్పింది. ఆయనపై వచ్చిన తీవ్రస్థాయి లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తామీ కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చిందనేది ఆ ప్రకటన సారాంశం. ఈ వార్త అప్పట్లో మనదేశ పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితమైంది.
అయితే అప్పుడు ఒక ఆసక్తికలిగించే పరిణామం ఒకటి జరిగింది. గతంలో ఆయన సన్నిహితులు, హితైషులు, స్నేహితులుగా ఉన్నవారు ఈ పరిణామంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన తన వృత్తిపరంగా ఎంతో నిపుణుడని, అసలు ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డ సంఘటనలను అంతవరకు తమ దృష్టికి రానేలేదని బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు అంతటి మంచి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటే నమ్మలేకున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి ఆయనకు మద్దతుగా నిలిచిన వారిలో మహిళలు, ఉదారవాద మహిళలు, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడేవారిని ఏమా త్రం సహించని మహిళలు కూడా ఉన్నారు. ఈ అంశం కొద్దికాలంపాటు పత్రికల్లో వచ్చినా, తర్వాత దాన్ని అంతా మరచిపోయారు. ఆయన మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా మరో వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో ఆ అంశాన్ని ఎవ్వ రూ పట్టించుకోలేదు.
పై కేసుతో పోలిన మరో సంక్లిష్టమైన సంఘటన ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా ప్రచారవౌతోంది. తరుణ్ తేజ్‌పాల్..! తెహల్కా పత్రిక ఎడిటర్..మరో యువ మహిళా జర్నలిస్టు మధ్య కొనసాగుతున్న తాజా జగడం సర్వే సర్వత్రా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కేవలం సామాజిక మీడియా మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన దినపత్రికలు, టెలివిజన్ చానళ్ళలో ఇది ప్రధానాంశమై కూర్చుంది. ము ఖ్యంగా తరుణ్ తేజ్‌పాల్ తప్పుడు ప్రవర్తనకు తగిన శిక్ష పడాల్సిందేనంటూ చానళ్ళలో చర్చల్లో పాల్గొంటున్నవారు, పలువురు వ్యాఖ్యాతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ తప్పుడు ప్రవర్తనకు సంబంధించిన అంశంలో కొత్తదనమేం లేదు. బాధితురాలు జూనియర్ స్ట్ఫార్! కార్యాలయానికి వచ్చి వెళుతుండగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదొక పెద్ద అవినీతి కుంభకోణం మాదిరిగా మీడియాలో విస్ఫోటం చెందకుండా ఉన్నట్లయితే, పెద్దగా నష్టమేమీ వాటిల్లకుండానే, ఈ సమస్య తెరమరుగైపోయి ఉండేది.
మొట్టమొదటి కేసు ఎక్కడో దూరాన ఉన్న దేశంలో (కెనడా)లో చోటుచేసుకుంది. అక్కడ వాస్తవంగా జరిగిందేంటనేది, సరియైన సమయంలో మనదేశ ప్రజలకు తెలియలేదు. అసలు ఆయనపై ఆరోపణ చేసిన మహిళ పేరేంటో..ఆమె ముఖం ఎట్లా ఉంటుందో మనదేశంవారికి తెలియదు. అయితే అప్పట్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఎదుర్కొన్న ప్రముఖుడికి మనదేశంలో మంచి పలుకుబడి ఉంది. అంతేకాదు మంచి స్నేహితులున్నారు. అతిచిన్న విషయాన్ని కూడా చిలవలు పలవలు చేసి భూతద్దంలో చూపించే సామాజిక మీడియాను అప్పట్లో ఉపయోగించేవారి సంఖ్య చాలా తక్కువ. మరి నాటితో పోలిస్తే నేటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చా యి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ఈ తాజా సంఘటనను విపరీతంగా ప్రచారం చేయడమే కాదు, ఎవ్వరూ దీన్ని మరచిపోలేనంతటి తీవ్రస్థాయిలో గగ్గోలు పెట్టడంతో, నిజంగానే అందరిలోను ఈ సంఘటన తాజాగా ఉండిపోయింది.
నిజం చెప్పాలంటే సామాజిక మీడియా అంటే సరికొత్త గ్రామం వంటిది. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశమే కాదు...ఆ అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో విస్తరిస్తుంది కూడా! ఈ కేసుపై ప్రజలనుంచి వ్యక్తమయ్యే విభిన్న అపస్వరాలన్నీ ‘ప్రజాభిప్రాయం’గా పరిగణలోకి వస్తాయి. అందువల్ల వీటిని పట్టించుకోకుండా ఉండటానికి ఎవ్వరూ సాహసించరు. మూడేళ్ళ క్రితం మనదేశ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇటువంటి అంశాలపై పెద్దగా పట్టింపు ధోరణి లేకుండా, స్థిరంగా వ్యవహరించేవారు. ముఖ్యంగా ప్రజల్లో ప్రచారానికి తావివ్వకుండా కేసును నిర్వహించేవారు. అంతేకాదు ఇటువంటి తెలివితక్కువ పనులు జరిగినప్పుడు, విషయం తెలియడం చాలా కొద్దిమందికి మాత్రమే పరిమితమై ఉండేది. కేసుపై ఇచ్చే తీర్పుకూడా పెద్దగా ప్రభావితం చేసేదిగా ఉండేదికాదు. వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్నవారి పేరు ప్రతిష్ఠలకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండేదికాదు. ఆవిధంగా తెలివితక్కువగా వ్యవహరించినవారికి తక్కువ సమయంలోనే తిరిగి వృత్తిలో చేరే అవకాశం కల్పించబడేది.
ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో, లైంగిక వేధింపులకు పాల్పడేవారు, మత్తుమందులకు బానిసైనవారు అప్పట్లోనూ ఉండేవారు. అయతే తమపై వచ్చిన ఆరోపణల తాకిడి సమసిపోగానే ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండానే అతిమామూలుగా తిరిగి సమాజంలో కలిసిపోయేవారు. ఇక పైస్థాయిలో ఉన్నవారు తమకనుకూలురైన వారిని రక్షించడం కూడా జరిగేది. అప్పట్లో ఆవిధంగా వ్యవహారాలు నడిచేవి. కానీ ఈసారి మీడియా ‘‘ఒక జర్నలిస్టు వెంట పడరాదు. వేధించరాదు’’ అని తనకు తాను విధించుకున్న నిబంధననే ఉల్లంఘించింది. ఏది ఏమైనా, బాధితురాలు సోమా చౌదరిని టెలివిజన్ యాం కర్లు ప్రశ్నించే సమయంలో..ఆమెను ఒక మేధావిగాను, ధారాళంగా మాట్లాడేదానిగాను, నేర్పుతో ఆమె ప్రయోగించే భాషను శ్లాఘిస్తూ చూపించడానికి యత్నించారు. ఇవన్నీ కలహశీలతను మరింతగా పెంచేవిగా ఉన్నాయి తప్ప మరోటి కాదు. ప్రస్తుతం మనలో ఒకదానిగా ఉన్న ఆమె, వారిలో ఒకరుగా మారిపోయింది. అంటే మనం తీవ్రంగా నిరసించే రాజకీయ నాయకుడిని రాత్రివేళల్లో తీవ్రస్థాయిలో అడ్డు అదుపులేని పదజాలంలో విచారించిన మాదిరి విచారణను ఆమె మీడియా నుంచి ఎదుర్కొనాల్సి వచ్చింది. నిజంగా ఇదంతా మనం ఇప్పటివరకూ అనుసరిస్తున్న సంప్రదాయాన్నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్టు స్పష్టం చేసిన పరిణామం.
అసలు ఎప్పుడైతే ఈ తప్పుడు పని సమాచారం న్యూస్ రూమ్‌లకు చేరిందో.. అప్పుడు జాతీయ ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా సంయమనం పాటించి ఉండాల్సింది. ఈ సంఘటన చుట్టే వార్తలు చిలవలు పలవలుగా అల్లుకుంటూ పోతే, మరింత విమర్శలకు తావిస్తుందన్న అవగాహనకు వచ్చివుండాలి. లైంగిల వేధింపులోని సున్నితత్వం బహుముఖాలుగా ఉంటుంది. నేడది అగ్నిపర్వత విస్ఫోటంతో సమానమైన అంశం. ముఖ్యంగా శక్తివంతులైన పురుషులు, యువతులవైపుకు ఆకర్షితులయ్యే అంశాలకు విపరీత ప్రాచుర్యం లభిస్తుంది. హతాశులను చేసే స్థాయిలో ఉన్న ఈ-మెయిల్స్‌ను లీక్ చేయడం పెద్ద తుఫానే సృష్టించింది. దీనివల్ల సామాజిక మీడియలో చిరాకుపుట్టించే రీతిలో విస్తృతంగా ప్రచారమైన ఈ అంశం విషయంలో, దినపత్రికలు, చానళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోయాయి. టివి న్యూస్, దిన పత్రికలు చదివే వర్గ ప్రజలే, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. అందువల్ల జర్నలిస్టులు కూడా తమ విలువైన కస్టమర్ల ఆలోచనా విధానానికి అనుగుణంగానే వ్యవహరించక తప్పదు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఇంతకంటే భయంకరమైన సంఘటనలే చోటు చేసుకున్నాయి. కాని వాటిల్లో చాలావరకు ఈ సంఘటనలు సమాజ దృష్టికి, మీడియా దృష్టికి రావడం లేదు. ప్రస్తుతం మీడియా తన జాతివాళ్ళకు వ్యతిరేకంగానే పెద్ద కథనాలు, సంచలనాత్మక వార్తలు ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ఉపక్రమించడానికి మించిన దౌర్భాగ్యం మరోటుండబోదు.
ప్రచార కండూతి పెరగడం వల్ల మరో నష్టం కూడా జరిగిపోయింది. ప్రసార భారతి బోర్డులో సభ్యుడిగా తేజ్‌పాల్‌ను తీసుకోవాలన్న ప్రతిపాదన ఉండింది. కానీ ఈ కేసు పుణ్యమాని ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ‘్ధంగ్‌ఫెస్ట్’ ప్రాయోజకులుగా ఉండటానికి ఎంతో ఉత్సాహం చూపేవారు, నేడు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటున్నారు. ఇక పురాతన స్నేహితులు..అప్పట్లో తేజ్‌పాల్‌తో కలిసి పనిచేసిన రోజులను ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటున్నారు. వృత్తిలో ఆయన ఎంతటి నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ అవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఒకనాడు ఆయనతో కలిసి పనిచేసిన వారే నేడు.. తేజ్‌పాల్...గర్విష్టి, తాగుబోతు, తిరుగుబోతు వంటి పదాలతో దూషించడానికి వెనుకాడటం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిలో ఏకాభిప్రాయం కుప్పకూలిపోయింది.
నిజానికి ఇది సహాయక హస్తాన్ని అందించాల్సి తరుణం. ఇప్పటినుంచి తామెంతో సుఖంగా సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తున్నామని భావించేవారు, ధనికులు, అధికారంలో ఉన్నవారి మధ్య తేలిగా గఅటూ ఇటూ పరిగెట్టక తప్పదు. వారు తమ పేరును ఇక్కడ వదిలేసి, అక్కడేమో ఎగతాళి మాటలు మాట్లాడుతూ, మరోపక్క అధిక లాభాలు తెచ్చిపెట్టే కాంట్రాక్టులను చేపడుతూ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరించేవారికి ఇకముందు కష్టాలు పడక తప్పదు. ఒక్కొక్క ముక్క విరిగిపడుతుంటే..అప్పటివరకు మీకు అనుకూలంగా కనిపించిన ప్రపంచం ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోతుంది.
తెలివితక్కువగా వ్యవహరించినప్పుడు, అవి ఎంత తీవ్రమైనవి అయినా త్వరలోనే క్షమించి, మరచిపోయిన నాటి రోజులు గతించిపోయాయి. తమకు అసౌకర్యంగా మారే వారిని భరించే స్థితిలో క్లబ్ లేదు. అన్ని ద్వారాలు చాలా వేగంగా మూసుకొని పోతాయి. వ్యర్ధులైన వారిని తిరిగి ఆహ్వానించే కాలం కూడా గతించిపోయింది. బలహీనుడిగా మారిన వ్యక్తిపైకి గుంపు దూసుకు వచ్చిందంటే అందుకు కారణం కేవలం జవాబుదారీతనం మాత్రమే. అదే అటవిక న్యాయం.
మూడేళ్ళక్రితం, భారతీయ పబ్లిషింగ్ రంగంలో ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదించిన వ్యక్తి, కెనడాలో తన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చేశారు!
english title:
tejpal
Date:
Wednesday, November 27, 2013