పెట్టుబడి ఉన్నంతకాలం, కులమత గోడలు కూలనంతకాలం మహా త్మాజ్యోతిభాఫూలే సజీవంగా ఉంటారు. కులాధిపత్యంతో అధికారం చెలాయస్తున్న కోటలను కూల్చివేయడానికి అట్టడుగు మహాజనావళికి భావజాల ఆయుధాన్ని అందించిన సామాజిక విప్లవ బహుజన సూరీడు మహాతామజ్యోతిభాఫూలే. ఆయన మరణించి 123 సంతవ్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన ఆలోచనా ధారలు మనలో సజీవంగా బతికున్నాయంటే ఈ దేశంలో మత, కులగోడలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది. రాబోయే వందేళ్ల తర్వాత సమాజం ఎలా ఉండాలో, సమాజంలోని నిత్య మార్పులకు ఏ రకమైన సంఘర్షణ ఉంటుందో చెబుతూ, దేశంలో కుల, మత అహంకారాన్ని ఎలా పెకలించాలో ఆచరణాత్మకంగా చూపిన అట్టడుగు మహాజనవాళి కంటి చూపుగా జోతిభాఫూలే మిగిలిపోతారు. బ్రాహ్మణీయ భావజాలంపై తిరగబడటం ఎంతకష్టమైందో, మతం, కులం ఆధిపత్యాలను కూల్చివేయడం ఎంత సాహసంతో కూడుకున్నదో ఆయన ఆచరణాత్మకంగా చూశాడు. అవమా నాలు పొంది, పరాభవాలను అనుభవించి నిలబడ్డాడు.
బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న బుద్ధుని తత్వానికి ఆధునిక రూపమిచ్చి, బహుజనతత్వ దార్శకుడిగా దారి చూపాడు. ఆయన రచనలు ‘‘గులాంగిరి’’, ‘‘హెచ్చరిక’’, ‘‘తృతీయరత్న’’ల ద్వారా ఆనాటి సమాజాన్ని, మనుధర్మాల వెనుక కుట్రలను ఛేదించాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శూద్రులెవరు? అన్న గ్రంథాన్ని రచించి మహాత్మా జ్యోతి భాఫూలేకి అంకితం చేశారంటే ఫూలే తాత్వికతను అర్థం చేసుకోవచ్చు. సమీకరించు, బోధించు, తిరగబడు అన్న తత్వాన్ని అందించిన ఛండాల ప్రచండ జ్ఞాన శూద్రుడు బహుజన సూరీడు ఫూలే.
దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు స్వేచ్ఛని, ప్రజలు విప్లవాన్ని ఏకకాలంలో కోరుతున్నారని మావో అన్నట్లుగానే అక్షరాల అంతకంటే ముందే ఈ విషయాన్ని ముందే చెప్పగలిగిన కాలజ్ఞాని ఫూలే. భారతీయ సమాజం స్వేచ్ఛను కోరుతున్న కాలమది. జాగృతం ముసుగులో ప్రజల చైతన్యాన్ని మతం రంగు అద్దుతున్న వైనాన్ని మహాత్మాఫూలే కనిపెట్టాడు కనుకనే 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఆనాడే ఆయన ధైర్యంగా విశే్లషించి చెప్పగలిగాడు. 1857 న జరిగిన తిరుగుబాటు దేశ స్వాతంత్య్రం పేరున బ్రాహ్మణీయ అగ్రవర్ణాలు, క్షత్రియ, మొగలాయ చక్రవర్తులు, తాము కోల్పోయన అధికారాన్ని తిరిగి పొందడానికి, ఫ్యూడల్ రాచరిక వ్యవస్థలను పునఃప్రతిష్ఠ చేసేందుకేనని ఆయన నాడే వాదించాడు. బ్రిటిష్ పాలన వల్ల తమ ఆధిపత్యం పోయందన్న మనుధర్మ ఆలోచనలను అర్ధం చేసుకోవాలని ఫూలే వాదించారు. ‘‘పాషాణంలా ఘనీభవించిన అభివృద్ధి నిరోధక, విప్లవ ప్రతిబంధక భారతీయ సంప్రదాయ ఫ్యూడలిజాన్ని బ్రిటిష్ వలస వాదులు బద్దలు కొట్టి వుండకపోతే ఇండియాలో సార్వజనీక ఆధునిక అభివృదిధ్రకమం అప్పటికి కూడా ఆరంభమయ్యేది కాదు,’’ అని మార్క్స్ అన్న మాటలు గమనార్హం. ఫూలే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన తరుణమిది. అధ్యయనం చేయాలి. బహుజన సమాజ స్థాపనే ధ్యేయంగా కృషి చేయాలి. ఈ నేపథ్యంలో ఫూలే ఆలోచన దారుల్లో ముందుకు సాగడమే ఉత్తమం.
నేడు 123వ వర్థంతి
english title:
k
Date:
Wednesday, November 27, 2013