లాత్వియా రాజధాని నగరం ‘రీగా’లో పోయిన గురువారం సాయంకాలం అకస్మాత్తుగా కుప్పకూలిన మాగ్జిమా సూపర్ మార్కెట్‌లో - కిటకిటలాడుతున్న జనాలలో యాభై మంది దుర్మరణం పాలు కాగా- ఎంతోమంది- ఆఖరికి రక్షించవచ్చిన అగ్నిమాపక సిబ్బంది సహా- శథిలాల క్రింద కూరుకుపోయారు.
అయితే, రుూ ‘మాల్’ భవనం పాతదేం కాదు. 2011లోనే దీనికి రిబ్బన్ కత్తిరించారు. లాత్వియా వెనుకటి సోవియట్ యూనియన్‌లో ఒక రాష్ట్రంగా వుండేది. ప్రశాంతమైన ‘దావుగావా’ నదీ తీరస్థ అందాల రీగా యిప్పుడే స్వతంత్ర రాజ్యం రాజధాని. అక్కడ పాతికేళ్ళ క్రితం మూడు రోజులు గడిపిన నాకింకా ఆ నగరం అందాలు జ్ఞాపకం వున్నాయి. ఇవాళ అది యింకా ఆధునిక నైపుణ్యాన్ని సంపాదించి వుండాలి. కానీ రుూ సూపర్ మార్కెట్ టాపు జనాలమీద మిన్ను విరిగి మీద పడ్డట్లు పడిపోయింది. అగ్నిమాపక దళం లోనికి పోతూ వుంటే చూస్తూండగానే- డాబా ముక్క మరొకటి విరుచుకుపడిపోయింది. కారణం చూడగా పై కప్పుమీద మిగిలివున్న ముక్క మీద నిలబడి భయపెడుతున్న రూఫ్ గార్డెన్ నిర్మాణ సరుకులు పూల తొట్టెలు వగైరా కనబడ్డాయి.
ఐదో అంతస్తులో సిమ్మింగ్‌పూల్, చివరి పదో అంతస్తులో నందనోద్యానవనం- నాగరికతగా మారిపోయిన రుూ కాలంలో అందరికీ యిదొక గుణపాఠం. టొపారంమీద తీగలు, లతలు ఫర్వానైగానీ ఏకంగా బృందావనమే నిర్మించేస్తే- యింతే సంగతులు. నిత్యనూతన ఒంటిస్తంభం ఆకాశహర్మ్యాల నిర్మాతా! ఓ మనిషీ! జాగ్రత్త!!
‘చైనా’ కోటీశ్వరులు!
చైనా మనకెప్పుడూ- ‘ఐసోరు’గా వుండే ఘనకార్యాలు సాధించాలని ప్రయత్నం చేస్తూంటుంది. ప్రపంచం మొత్తంమీద- పిన్న వయస్కులయిన కోటీశ్వరులు- ఆ దేశంలోనే వున్నారు. వారి సరాసరి వయసు 53 సం.లే కాగా- ఇండియన్ కోటీశ్వరుల సగటు వయస్సు 63 సంవత్సరాలు. ప్రపంచ కోటీశ్వరుల సగటు వయసు 62 సంవత్సరములు మాత్రమే. అన్ని ప్రాంతాలకన్నా ‘ముసలి సంపన్నులు’ అమెరికాలో వుండటం ఆశ్చర్యం! (67 సం.లు) అయితే- అరబ్ ఎమిరేట్స్ దేశస్థులు కూడా సిరిసంపదల విషయంలో పిన్నవయస్కులే. చైనాకన్న ఒక్క ‘కొంచెం’ ముందు పడి వున్నారు (57). ఆయా దేశాలలో అతి సిరిగల వారి వయోపరిమితులు యిలా వున్నాయి. కెనడా-66; జర్మనీ-66; సౌతాఫ్రికా 63; హాంకాంగ్, బ్రెజిల్, సౌదీ అరేబియా దేశాలు 64; ఇవన్నీ ‘వెల్త్ ఎక్స్’ వారి అంచనాలు. ఏదిఏమైనా, కోటీశ్వరుడయినా- కుబేరుడైనా వజ్రాలు కొరుక్కుతినలేడు కదా? లవణమన్నమే తినాలిగా? ఆ ‘ఉప్పు’చాలా ఖరీదైనది అయిపోతోంది ఈమధ్య... *
లాత్వియా రాజధాని నగరం ‘రీగా’లో పోయిన గురువారం సాయంకాలం అకస్మాత్తుగా కుప్పకూలిన మాగ్జిమా సూపర్ మార్కెట్‌లో - కిటకిటలాడుతున్న జనాలలో యాభై మంది దుర్మరణం పాలు కాగా- ఎంతోమంది- ఆఖరికి రక్షించవచ్చిన అగ్నిమాపక సిబ్బంది సహా- శథిలాల క్రింద కూరుకుపోయారు.
english title:
veeraji
Date:
Thursday, November 28, 2013