రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించిన ప్రోరోగ్ విషయంలో వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అసెంబ్లీ అనేది ఒక సంస్థ, ఇది రాజ్యాంగం ఆధారంగా ఏర్పడింది. అటువంటి సంస్థ నిర్వహణ విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను అనే భావన కాకుండా విభిన్నంగా వ్యవహరించాలని చూడటం సబబుకాదు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని అని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరించాలనకోవడం ఏమిటి? ఏదైనా ఉంటే అధిష్టానంతో, కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోవాలి. ముఖ్యమంత్రి కావాలని చట్టసభలను దుర్వినియోగం చేయడం సమంజసం కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆలోచనా విధానాన్ని శాసనసభలో చర్చిస్తే మంచిదనే సంప్రదాయం ఉంది తప్పితే రాజ్యాంగంలో గాని, చట్టంలో గాని వేరే ఇతరాత్రా ఏ నిబంధనలూ లేవు. అసెంబ్లీ ప్రోరోగ్ చేస్తే మళ్లీ షెడ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది, రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్‌కు సమయం పడుతుంది తప్ప మరొకటి కాదు. దానివల్ల అత్యధికంగా సమయం తీసుకుంటుందనే భావన ఉంది. ఈ ఆలోచనల వల్లే ప్రోరోగ్ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి సమయంలో ప్రోరోగ్‌పై సరైన నిర్ణయం తీసుకోవాలే తప్ప ముఖ్యమంత్రి పట్టుదలకు పోవడం చాలా విడ్డూరం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం శాసనసభకు పంపించి దీనిపై చర్చించాలనే నిబంధన కూడా ఎక్కడా లేదు. తెలంగాణ విషయంలో మా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా చెప్పాం. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా గట్టి తీర్మానం చేశాం. ఎలాంటి ఆంక్షలు లేకుండానే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి సంపూర్ణ మద్దతును బిజెపి అందిస్తోంది. కేంద్రంలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే తాము సంపూర్ణ మద్దతిస్తాం. అయతే, ఉద్యోగాలు, నీరు, అవకాశాలు, ఇతర సమస్యలపై కూడా అందరూ కూర్చుని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను పాటించి రాష్ట్ర విభజనపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కమిటీలు ఉన్నాయి. వారు సలహాలిస్తారు. వాటిని కూడా మనం అనుసరించవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు, దాని కోసం కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలు కృషి చేయాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించిన ప్రోరోగ్ విషయంలో
english title:
p
Date:
Thursday, November 28, 2013