అత్యున్నత రాష్టప్రతి స్థాయిలో శాసనసభ అభిప్రాయం అడిగితే, అడ్డుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉండదు. శాసనసభను ప్రోరోగ్ చేయడం, చేయకపోవడం అనేది పెద్ద అంశమే కాదు. దీనివల్ల రాష్ట్ర విభజనకు అడ్డంకి అవుతుందనుకునే వారివి పగటి కలలు మాత్రమే. శాసనసభను ప్రోరోగ్ చేయమని చెప్పే అధికారం ముఖ్యమంత్రి ఒక్కరికే ఉండదు. దీనికి ఆయనకు మంత్రివర్గం నుంచి కూడా ఆమోదం అవసరం. తెలంగాణ మంత్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి ఏకపక్షంగా శాసనసభను ఎట్టి పరిస్థితుల్లో ప్రోరోగ్ చేయలేరు. శాసనసభ ప్రోరోగ్ కావడం, కాకపోవడం అనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ. దీంట్లో రాజకీయాలకు ప్రమేయం ఉండదు. రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకునే శక్తి కిరణ్‌కుమార్ రెడ్డికే కాదు, ఏ ముఖ్యమంత్రికీ ఉండదు. రాష్ట్ర విభజనపై బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసాకే, అది రాష్టప్రతికి వెళ్తుంది, అక్కడి నుంచి ఆయన రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. శాసనసభలో బిల్లుపై సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటారు. సభ్యులంతా వ్యతిరేకించినా, ఆమోదం తెలిపినా, రాష్ట్ర విభజన జరపాలా.. వద్దా? అనే దానిపై రాష్టప్రతికి సర్వాధికారాలు ఉంటాయి. అంతేకానీ రాష్టప్రతి శాసనసభ అభిప్రాయాన్ని కోరిన తర్వాత కూడా శాసనసభను సమావేశ పర్చకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావించడం చౌకబారు ఎత్తుగడ మాత్రమే. రాష్ట్ర విభజనపై కేంద్రానికి సర్వాధికారాలదను రాజ్యాంగం కల్పించింది. ఎవరో ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకించినంత మాత్రాన విభజన ఆగుతుందని అనుకోవడం పిచ్చి భ్రమ మాత్రమే. శాసనసభను ప్రోరోగ్ చేయడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలకు తెలంగాణ మంత్రులు బాధ్యత వహించాలి. రాజ్యాంగపరమైన ప్రక్రియకు ముఖ్యమంత్రి అడ్డుకుంటానంటే, తెలంగాణ మంత్రులు వౌనంగా ఉంటారని అనుకోవడం లేదు. అలా ఏదైనా జరిగింది అనుకోండి... దానికి కాంగ్రెసు పార్టీ, తెలంగాణ మంత్రులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. తమ దృష్టిలో శాసనసభ ప్రోరోగ్ కావడం, కాకపోవడం అనేది, రాష్ట్ర విభజనకు ఎంతమాత్రం అడ్డంకి కాదు, ఇది పెద్ద అంశమే కాదనేది భావిస్తున్నాం.
అత్యున్నత రాష్టప్రతి స్థాయిలో శాసనసభ అభిప్రాయం అడిగితే, అడ్డుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉండదు.
english title:
cm
Date:
Thursday, November 28, 2013