తిరుపతి, మార్చి 6: శ్రీ వెంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్ధ ఆసుపత్రి సేవలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు కొనియాడారు. మంగళవారం ప్రపంచ ప్రసిద్దిగాంచిన ప్రముఖ కార్డియాలజిస్టు ప్రొఫెసర్ సోమ సుందరం స్విమ్స్‌ను సందర్శించారు. ఆయన వెంట కనుమూరి బాపిరాజు కూడా ఉన్నారు. అనంతరం స్విమ్స్ ఓపిడి బ్లాక్‌లో సోమరాజుకు డైరెక్టర్ వెంగమ్మ, కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణ దంపతులు , డీన్ రాజశేఖర్ ఘనంగా స్వాగతం పలికి, దుశ్శాలు, బంగారు పతకంతో సన్మానించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ స్విమ్స్ సేవలు ఎంతో బాగున్నాయన్నారు. టిటిడి తరపున తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డియాలజి ఛైర్ ఓరేషన్ ( అద్యయనపీఠం) కార్యక్రమాన్ని డైరెక్టర్ వెంగమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమ దాత శ్యామలాశాస్ర్తి భర్త సుబ్రమణ్యం శాస్ర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డీన్ రాజశేఖర్ కార్డియాలజిస్టు సోమరాజు జీవిత చరిత్రను చదివి వినిపించారు. ప్రపంచం ఎక్కువభాగం ఆరోగ్యంపై కాకుండా ఇతర అనవసర విషయాలపై దృష్టి సారించి అనారోగ్యాలు పాలు అవుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్యంపై ఎక్కువ నిధులు వ్యయం చేయ్యాల్సిన అవసరాన్ని ప్రపంచదేశాలన్నీ గుర్తించాయన్నారు. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగిని ప్రేమతో సేవలు అందించాల్సిన అవసరం వుందన్నారు. నేటి సమాజంలో విలువలు రోగురోజుకు దిగజారిపోతున్నాయన్నారు. పెద్దలకు పేదలకు మద్య అంతరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయన్నారు. పేదవానికి ఆధునిక వైద్యం అందుబాటులోనికి తీసుకువచ్చే చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక వైద్య విధానాలు, చికిత్సా పద్ధతులు, శస్తచ్రికిత్సలు వాటి అవగాహనను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ప్రతి సంస్ధ ఇటువంటి కార్యక్రమాలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం వుందన్నారు. శ్రీవారి దర్శనార్దం వచ్చి గుండెజబ్బుతో బాధపడేవారు స్విమ్స్‌లో చికిత్స పొంది ఎంతో సంతోషంగా వెళుతున్నట్లు తాను గుర్తించానన్నారు. టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ స్విమ్స్ 24 గంటల పాటు పేదలకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తూ వేలాది మంది ప్రాణాలు కాపాడుతోందన్నారు. డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హృద్రోగ నిపుణుడు, కేర్ అసుపత్రి వైద్యుడైన డాక్టర్ సోమరాజు ప్రపంచం మెచ్చిన వైద్యుడన్నారు. తన జీవితాన్ని వైద్యరంగానికి అంకితం చేశాడని కొనియాడారు. ఆయనను ప్రతి డాక్టర్ ఆదర్శంగా తీసుకుని సమాజానికి వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ రామసుబ్బారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓలు డాక్టర్ గోవిందనారాయణ, డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ ఎశై లక్ష్మి,డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ అల్లాడి మోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ (పిఆర్‌ఓ) డాక్టర్ వెంకటరామిరెడ్డి, పిఆర్‌ఓ రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాస్, వరలక్ష్మి, నాగ ప్రసూన్న, పిఆర్‌ఓ విభాగం సిబ్బంది, వివిధ డాక్టర్లు, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్ధ ఆసుపత్రి సేవలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని టిటిడి చైర్మన్ కనుమూరి
english title:
cooperation to swims
Date:
Wednesday, March 7, 2012