తిరుపతి,మార్చి 6: క్రీడలు మానసిక,శారీరక దృఢత్వానికి ఎంతో దోహపడతాయని పలువురు అఖిలపక్ష నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి కోనేటి కట్ట జీపు, టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆ సంఘాల గౌరవాధ్యక్షులు కృష్ణయాదవ్ అధ్యక్షతన వేదాంతపురం అగ్రహారం గేట్ కళాశాల మైదానంలో క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.క్రికెట్ పోటీల్లో మురళీయాదవ్ కెప్టన్సీలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస జీవు డ్రైవర్ల అసోసియేషన్ విజేతగా నిలువగా, రన్నర్స్‌గా లోకాయాదవ్ కెప్టెన్సీలోని శ్రీపద్మావతి మాక్సీక్యాబ్ అసోసియేషన్ నిలిచింది. కబడ్డీలో రాజేష్‌యాదవ్ కెప్టెన్సీలోని శ్రీలక్ష్మిశ్రీనివాస జీపు డ్రైవర్ల అసోసియేషన్ విజేతగా నిలువగా రన్నర్స్‌గా అయ్యప్ప కెప్టన్సీలోని శ్రీలక్ష్మిగణపతి ప్రీపెయిడ్ అటో యూనియన్ నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం చేసిన నేతలు మాట్లాడుతూ కబడ్డీ పోటీలు మన జాతీయ క్రీడ అని తెలిపారు. క్రీడలు మానసిక, శారీరక దృఢడత్వానికి ఎంతో దోహదదపడతాయన్నారు. నిత్యం తిరుమల యాత్రికులకు సేవలు అందిస్తూ మానసిక వత్తిడితో జీవించే డ్రైవర్లకు తొలిసారిగా ఇలా క్రీడాపోటీలు నిర్వహించిన కృష్ణయాదవ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి,టిడిపి రాష్ట్ర కార్యదర్శి జి నరసింహయాదవ్, జిల్లా పార్టీ ఉపాద్యక్షులు సూరా సుధాకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు ఆర్‌సి మునికృష్ణ,తెలుగుమహిళా జిల్లా అద్యక్షురాలు వి పుష్పావతి, టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మస్తాన్‌నాయుడు, నీలం బాలాజి, బీసి సంఘర్షణ సమితి వ్యవస్ధాపక అద్యక్షులు అన్నారామచంద్రయ్య, వేదాంతపురానికి చెందిన తిరుపతి రూరల్ కాంగ్రెస్ నేత జనార్ధన్, బిసిసెల్ కాంగ్రెస్ జిల్లా అద్యక్షుడు బడి సుధాయాదవ్, కాంగ్రెస్ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, వుకా విజయ్‌కుమార్, కిరణ్‌రాయల్, టిడిపి నాయకులు దాము, రామచంద్రయ్య, మనోహాచ్చారి, సంపూర్ణ, సిపిఎం నేతలు పెంచలయ్య, కెఎస్‌మణ్యం, సిపిఎం, సిఐటియు నాయకులు వాడ గంగరాజు, మోహన్‌రావు,నరేంద్ర, సుబ్రహ్మణ్యం, బిసి నేతలు దంపూరి బాస్కర్, అవిలాల సుధాకర్, నారాయణరాజు, జీపు డ్రైవర్ల అసోషియేషన్ నేతలు మురళీయాదవ్, ఎన్‌ఎస్ శ్రీనువాసులు, రాజేష్, ఆటో డ్రైవర్ల అసొషియేషన్ అయ్యప్ప, బాలాజి, రమేష్, వ్యాన్ డ్రైవర్ల అసోషియేషన్ నేతలు లోక్ సుబ్రమణ్యం, హరియాదవ్, డిల్లీ తదితరులు పాల్గొన్నారు.
===
రష్‌లో అరుదైన చికిత్స విజయవంతం
తిరుపతి, మార్చి 6: కడుపులో గడ్డలతో బాధపడుతున్న యువతికి రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మంగళవారం ఆపరేషన్ చేసి స్వస్థత చేకూర్చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జ్యోతి అనే పదకొండేళ్ల పాప కడుపులో గడ్డలతో విపరీతమైన నొప్పితో తమ ఆసుపత్రికి వచ్చిందన్నారు. అయితే అప్పటివరకు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం కానరాకపోవడంతో తమకు వద్దకు వచ్చారన్నారు. దీనిపై పలు రకాల పరీక్షలు నిర్వహించి గర్భసంచిలో ద్రవం నిలిచి గడ్డగా మారడం వలన నొప్పి వస్తోందని గుర్తించామన్నారు. వైద్య పరిభాషలో దీన్ని ‘వాజినల్ అట్రేసియా’ అంటారన్నారు. ఎటువంటి ఆపరేషన్ లేకండా ఒక చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోపి పద్ధతిలో గర్భసంచికి, జననేంద్రియానికి అనుసంధానం చేశామన్నారు. ఒక్కరోజులోనే ఆ పాపను ఇంటికి పంపగలిగామని తెలిపారు. ఈ చికిత్సలో తనకు ప్రముఖ గైనకాలజిస్ట్‌లు డాక్టర్ రేఖరాణి, డాక్టర్ రమణ సహకరించారన్నారు.
============
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
* 1100 మంది గైర్హాజరు
తిరుపతి, మార్చి 6: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు -2 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 44,254 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా ఇందులో 1100 మంది గైర్హాజరు అయ్యారు. కాగా 40,441 మంది జనరల్ విద్యార్థులు హాజరుకావాల్సి వుండగా 932 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 3813 మంది హాజరు కావాల్సి వుండగా 3645 మంది హాజరైయ్యారు. ఆర్‌ఐ ప్రభాకర్ రేణిగుంట మార్గంలోని విజయ్‌కృష్ణ జూనియర్ కళాశాల, కృష్ణతేజా జూనియర్ కళాశాలల్లో నూ, రేణిగుంటలోని శ్రీనివాస తేజ, కెఆర్‌సి జూనియర్ కళాశాల్లోనూ తనిఖీలు చేశారు. కాగా ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఎస్వీ జూనియర్ కళాశాలకు సంస్కృత అధ్యాపకులు తప్పని సరిగా హాజరు కావాలని ఆర్‌ఐఓ ప్రభాకర్‌రావు కోరారు. ఈ సందర్భంగా స్పాట్ వ్యాల్యుయేషన్‌కు సంబంధించి తగు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.