శ్రీ అమ్మా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.సి.ఆదిత్య దర్శకత్వంలో తరుణ్, సుందర నాగరాజు, నేహాశ్రీ కరమ్ ప్రధాన పాత్రధారులుగా నిర్మాణమవుతున్న చిత్రం ‘తాతగారింటికి’. బి.రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు పి.సి.ఆదిత్య మాట్లాడుతూ- వేరువేరు దేశాల్లో ఉన్న ఇద్దరు తండ్రీకొడుకుల కథగా ఈ చిత్రం ఉంటుందని, తండ్రికి దూరమైన కొడుకు, అతని తండ్రికి స్వదేశంలో మనవరాలు, కొడుకుల జ్ఞాపకాలతో బ్రతుకుతుండగా, వారిమధ్య జరిగిన ఓ బంధుత్వాల సమాహారంలో ఈ చిత్రం నిర్మాణమవుతుందని, ముఖ్యంగా తాతగారింటికి వెళ్లాలనుకున్న మనవరాలులోని భావోద్వేగాలు, భావాలు ఈ చిత్రంలో ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తాయని తెలిపారు. హీరోయిన్ సరసన మరో ఇద్దరు హీరోల కోసం ఎంపిక జరుపుతున్నామని, మారిషస్‌లో టాకీపార్ట్ పూర్తిచేసి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 5 నుండి ప్రారంభవౌతుందని, ఫిబవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా తాను ఈ చిత్రంలో నటిస్తున్నానని, కెనడాలో పుట్టినపెరిగినా భారతీయ చిత్రాలంటే తనకిష్టమని, ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం కావడం ఆనందంగా ఉందని నేహాశ్రీ కరమ్ తెలిపారు. ఓ అందమైన బంధుత్వాల కథ, కథనాలతో కుటుంబ కథా చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆదిత్య దర్శకత్వం విలువలతో ఈ చిత్రం సరికొత్తగా రూపొందనుందని నిర్మాత బి.రమేష్ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని విశేషాలను తెలిపారు. ఎల్.పి.రామారావు, పటేల్, ముఖేష్, రమ్యానాయుడు, కె.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:శ్రీకాంత్, అర్ల గణేష్, పాటలు: కంభం శ్రీనివాస్, వౌనశ్రీ మల్లిక్, నిర్మాత: బి.రమేష్, దర్శకత్వం: పి.సి.ఆదిత్య.
శ్రీ అమ్మా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.సి.ఆదిత్య దర్శకత్వంలో
english title:
tata
Date:
Saturday, November 30, 2013