Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పాటల పల్లకిలో ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’

$
0
0

హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్లెల సీతారామరాజు - పిల్లాడి స్వాతి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. దీనికి ఉపశీర్షిక ‘1ఇయర్ మాత్రమే గ్యారంటీ’. శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్- మనోచిత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఉదయరాజు.ఎ. దర్శకుడు. యువ సంగీత దర్శకుడు రఘురాం స్వరాలు అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల జయభేరి క్లబ్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ ఆడియోను విడుదల చేయగా, గంటా శ్రీనివాసరావు తొలి ప్రతిని అందుకున్నారు. కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ- నేను చాలా రోజుల తర్వాత నటిస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనరిది. దర్శకుడు ఉదయరాజు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. రఘురాం అందించిన బాణీలు బాగున్నాయి. వర్షం పడుతున్నప్పటికీ మా మీద అభిమానంతో ఈ ఆడియో వేడుకలో పాలు పంచుకొన్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మం ఉంది అన్నారు. ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ చిత్రం గురించి తాను మాట్లాడడం కన్నా తన చిత్రం మాట్లాడటమే సబబని దర్శకుడు ఉదయరాజు తెలిపారు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించి, తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించాలని చిత్ర నిర్మాతలు మల్లెల సీతారామరాజు - పిల్లాడి స్వాతి కోరారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, వి.వి.వినాయక్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎం.ఎల్.కుమార్ చౌదరి వి.సాగర్, బెక్కెం వేణుగోపాల్, పోసాని కృష్ణమురళి, తరుణ్, సి.సి.సి. చైర్మన్ షఫీ చిత్ర బృందం పాల్గొన్నారు. డా.బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రంగనాధ్, వెనె్నల కిషోర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘురాం, ఛాయాగ్రహణం: వాసు, పాటలు: భాస్కరభట్ల, కళ: విజయకృష్ణ, సహ నిర్మాతలు :బాలాజి శ్రీను, అక్కినేని శ్రీను, నిర్మాతలు: మల్లెల సీతారామరాజు - పిల్లాడి స్వాతి, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఉదయరాజు.ఎ.

హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్లెల సీతారామరాజు
english title: 
paatala pallakilo

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>