హైదరాబాద్, డిసెంబర్ 30: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. చంద్రబాబు ప్రాజెక్టులను కట్టకపోవడం వల్లే మిగులు జలాలు పొందలేకపోయామని వైఎస్ఆర్సిపి నేతలు గట్టురామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ప్రాజెక్టులను ఆటంకం కలుగకూడదనే చట్టం చేయాలని అఫిడవిట్లో కోరినట్లు చెప్పారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే ఈ దుస్ధితి వచ్చేదికాదన్నారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు అడ్డుకోలేకపోయారన్నారు. మన రాష్ట్రప్రభుత్వం కూడా ట్రిబ్యునల్ ఎదుట పటిష్టమైన వాదనలు చేయలేకపోయిందన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సాగునీటి ప్రాజెక్టుల
english title:
no right
Date:
Sunday, December 1, 2013