హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపులేని కారణంగా అసమర్ధవాదనల ఫలితంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిందని సిపిఐ రాష్టక్రార్యదర్శి వర్గ సమావేశం తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. అల్‌మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుండి 524.2 అడుగుల ఎత్తును పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం గోరుచుట్టుపై రోకటి పోటు లా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సహజ న్యాయ సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి బ్రిజేష్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను విశ్వసనీయత 65 శాతానికి లెక్కించడమే అసహజమైన గణింపు కింద రాష్ట్రం మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ కల్పిస్తే, బ్రిజేష్ ట్రిబ్యునల్ వాటిని కూడా మూడు రాష్ట్రాల మధ్య పంపకం చేయడం ఎగువ రాష్ట్రాలు తమ జలాలను వాడుకున్న తర్వాతనే మన రాష్ట్రానికి నీటి లభ్యత దొరగడం గాలిలో దీపం వంటిందని అన్నారు. తప్పుడు లెక్కల ప్రకారం 47 ఏళ్ల నీటి లభ్యత వివరాలు ప్రాతిపదికన 65 శాతం విశ్వసనీయతతో నీటి పరిణామాన్ని లెక్కకట్టి దిగువ రాష్ట్రం ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతుల్లో తీర్పు వెలువరించడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా మంట కలపడమేనని అన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని తక్షణం నిర్వహించాలని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జూన్ నెలలో అవసరమైన అదనపు 94 టిఎంసిలను అల్మట్టి నుండి విడుదల చేయించుకునే ప్రయత్నం చేయాలని అన్నారు.
సాంస్కృతిక మండళ్లను ఏర్పాటు చేయాలి
సాంస్కృతిక మండళ్లు, అకాడమిలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి కె. సుబ్బరాజు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం ఆవేదన
english title:
cpi
Date:
Sunday, December 1, 2013