అహ్మదాబాద్, నవంబర్ 30: పటాన్‌లోని ప్రభుత్వ కళాశాలకు చెందిన 19 ఏళ్ల దళిత విద్యార్థినిపై సామూహిక అత్యాచార కేసులో దోషులుగా తేలిన ఆరుగురు ఉపాధ్యాయుల్లో ఐదుగురికి జీవిత ఖైదు విధించడాన్ని గుజరాత్ హైకోర్టు శనివారం సమర్ధించింది. అయితే ఈ కేసులో దోషిగా తేలిన మరో ఉపాధ్యాయుడికి విధించిన జీవిత ఖైదును పదేళ్ల జైలు శిక్షకు న్యాయస్థానం కుదించింది. పటాన్‌లోని ప్రభుత్వ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ (పిటిసి)లో పనిచేస్తున్న మనీష్ పర్మార్, మహేంద్ర ప్రజాపతి, అశ్విన్ పర్మార్, కిరణ్ పటేల్, సురేష్ పటేల్ అనే ఉపాధ్యాయులకు 2009లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని సమర్ధిస్తున్నామని, అయితే ఈ కేసులో అతుల్ పటేల్ అనే మరో ఉపాధ్యాయుడికి విధించిన జీవిత ఖైదును పదేళ్ల జైలు శిక్షకు తగ్గిస్తున్నామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఐదుగురు టీచర్లకు జీవిత ఖైదు * మరో ఉపాధ్యాయుడికి పదేళ్ల జైలు
english title:
gang rape
Date:
Sunday, December 1, 2013