హైదరాబాద్, నవంబర్ 30: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుడు డాక్టర్ వై వెంకటరామిరెడ్డికి భారతీయ సాంకేతక విద్యా మండలి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని శనివారం నాడు అందజేసింది. వెంకటరామిరెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు వచ్చి అవార్డును అందుకున్నారు. గీతం ప్రాంగణంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. నిర్మల్ ఎమ్మెల్యే ఎ మహేశ్వర్‌రెడ్డి, ఐఎస్‌టిఈ చైర్మన్ ప్రొఫెసర్ లాల్ కిశోర్, కార్యదర్శి ప్రొఫెసర్ వి రామారావు చేతులు మీదుగా ఈ ప్రదానోత్సవం జరిగింది. అవార్డులను పొందిన వారిలో గీతం డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ సంజయ్, ప్రొఫెసర్ కె. వేణుగోపాల్‌రావు, ప్రొఫెసర్ ఆనందరావు, స్రవంతి సత్యవరపు, రాచర్ల అమూల్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌బిఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ ఎస్ ప్రసాదరావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ, వైస్ ప్రిన్సిపాల్ బి బసవరాజు, కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ టి త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా రిజిస్ట్రార్‌గా ప్రతాప్‌రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఎస్‌ఎన్ రెడ్డి శనివారం నాడు పదవీ విరమణ చేశారు. ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రుసా నిధులపై విసిలతో చర్చ
రుసా నిధుల వినియోగం-ప్రణాళికపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వివిధ వర్శిటీల వైస్ ఛాన్సలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రుసా నిధుల వినియోగానికి సంబంధించిన ప్రణాళికలను అందజేయడంలో ఘోరంగా విఫలం కావడంతో తొలి దశ నిధుల వినియోగానికి సంబంధించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకోలేదు.
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుడు
english title:
upsc member
Date:
Sunday, December 1, 2013