హైదరాబాద్, నవంబర్ 30: లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్పాల్ను అరెస్టు చేయకపోవడం విచారకరమని బిజెపి ఎస్సీ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. తరుణ్ తేజ్పాల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను ఎస్సీ మోర్చా నేతలు దగ్ధం చేశారు. తేజ్పాల్ను నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ అధ్యక్షుడు కె. రాములు, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, జీవన్, పరమేష్, కార్యదర్శులు కిషన్, నరహరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు భగవాన్దాస్, మహిళామోర్చ నాయకులు గీతారెడ్డి, స్నేహలత, శాంతి తదితరులు పాల్గొన్నారు.
* కఠినంగా శిక్షించాలని బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్
english title:
bjp sc morcha
Date:
Sunday, December 1, 2013