Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

$
0
0

కేసముద్రం, డిసెంబర్ 1: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేసముద్రం మండలం బేరువాడ శివారులో చోటుచేసుకొంది. కేసముద్రం ఎస్‌ఐ అబ్ధుల్ రహమాన్, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. బోడమంచ్యతండాకు చెందిన బోడ అనిత (28)కు అదే తండాకు చెందిన బావ్‌సింగ్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు జన్మించినా భర్త అనుమానంతో నిత్యం భార్యను వేధించేవాడు. ఇటీవల పెద్దలు పంచాయతీ కూడా చేసి ఇద్దరికీ సర్ది చెప్పారు. అయినా భర్త తీరులో మార్పురాకపోవడంతో వేధింపులు తట్టుకోలేక శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. భార్య ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనను చూసిన భర్త పరారైనట్లు ప్రచారం సాగుతోంది. భావ్‌సింగ్‌కు గతంలో ఇద్దరితో వివాహం జరగగా ఇదే తరహాలో వేధింపులకు గురిచేయడంతో విడాకులివ్వగా తల్లిదండ్రుల్లేని అనితను ఇచ్చి వివాహం జరిపించి మార్పు వస్తుందనుకున్నా ఫలితం లేకుండా పోయిందని.. అతని వేధింపులకు చివరకు అనిత బలైందని తండవాసులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు తండ్రి కనిపించకుండా పోవడం.. ఇటు తల్లి చనిపోవడంతో ఇద్దరు కుమారులు గణేష్, ముణి అనాథలుగా మారిపోయారు. ఇందులో గణేష్ పుట్టుమూగ, చెవుడు కావడంతో ఆ బాలుని చూసిన ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని మహబూబాబాద్ రూరల్ సిఐ సతీష్ సందర్శించారు.

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు
english title: 
suicide

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>