Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కెసిఆర్ ఆస్తులపై విచారణకు మేం రె ‘ఢీ’

$
0
0

నర్సంపేట, డిసెంబర్ 1: కెసిఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమేనని, చంద్రబాబు ఆస్తులపై విచారణకు టిడిపి సిద్ధంగా ఉంటే ముందుకు రావాలని కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల రామారావు సవాల్ విసిరారు. పదే పదే కెసిఆర్ సెంటిమెంట్ పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కెటిఆర్‌తో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టిఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు మాట్లాడారు. కెసిఆర్ ఆస్తులపై సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలతో విచారణకు సిద్దమేనని స్పష్టం చేశారు. లేకపోతే విచారణ కమిటీ, కమిషన్లు వేసినా తాము స్వాగతిస్తామని చెప్పారు. కెసిఆర్ 1954వ సంవత్సరంలో పుట్టాడని అప్పటి నుండైనా లేక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచైనా విచారణకు సిద్ధమేనన్నారు. పదవుల కోసం పైరవీ చేసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ పదవి తెచ్చుకున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేందుకు, మెప్పు పొందేందుకు కెసిఆర్‌పై పసలేని విమర్శలు చేయడం సరి కాదన్నారు. తెలంగాణపై చంద్రబాబుకు ఏం చెప్పాలో అర్ధం కాలేని సంకట స్థితితో కొట్టుమిట్టాడుతున్నాడని చెప్పారు. ఇప్పటికీ తన పార్టీ వైఖరి ఏమిటో తెలియని గందరగోళ పరిస్థితి టిడిపిలో నెలకొందని, చంద్రబాబు మొన్న రెండు కళ్ల సిద్ధాంతం, ఇద్దరు కొడుకుల సిద్ధాంతం, నిన్న సమన్యాయం, నేడు కొబ్బరి చిప్పల సిద్ధాంతం అంటూ చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చివరకు చంద్రబాబుకు మిగిలేది కొబ్బరి చిప్పలేనని స్పష్టం చేశారు. టిడిపిది సమైక్య వాదమా, తెలంగాణ వాదమా, పచ్చి అవకాశ వాదమా అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చేత చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో సమన్యాయం పాటించాలని, తెలంగాణపై మరో మారు అఖిల పక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు కేంద్రం అఖిల పక్షం పెట్టేసరికి తోకముడిచాడని విమర్శించారు. సమన్యాయం అంటే ఏంటో సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. తాము ఇచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్యే రేవూరి ఇక్కడ చెబుతున్నాడని, చంద్రబాబు మాత్రం రెండు ప్రాంతాల జెఎసిలను పిలిచి సమన్యాయం చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద రాజకీయ పార్టీలను పిలిచి అభిప్రాయాలను చెప్పాలని కేంద్రం కోరగా అభిప్రాయం చెప్పలేని చంద్రబాబు నాయుడు తన టిడిపి పార్టీని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కనె్నబోయిన రాజయ్య యాదవ్, జిల్లా నాయకులు మార్నేనేని రవీందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు, దార్ల రమాదేవి, బైరి తిరుపతిరెడ్డి, గుంటి కిషన్, నాయిని నర్సయ్య, పుట్టపాక కుమారస్వామి, గోనెల వెంకటస్వామి, తోట సుదర్శన్, పంజాల రాము తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ సమావేశంలో చీఫ్‌విప్ గండ్ర
పరకాల టౌన్, డిసెంబర్ 1: రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నాయని ప్రభుత్వ చీఫ్‌విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మొట్లపల్లి గ్రామంలో పిఎసిఎస్, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు దళారుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు పంటలను కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండలంలోని మొట్లపల్లి, మొగుళ్ళపల్లి గ్రామాలకు చెందిన మోహన్‌రెడ్డి, విజేందర్‌రెడ్డిల కుటుంబాలను ఆదివారం ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యార మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బక్కిరెడ్డి, వైస్ చైర్మన్ మంద కొమురయ్య, డిసిసిబి జోనల్ అధికారి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

బాబు ఆస్తులపై విచారణకు టిడిపి సిద్ధమేనా? * తెరాస నేత కెటిఆర్ సవాల్
english title: 
ktr

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>