పుత్తూరు, మార్చి 6: చేనేత కార్మికులు అయిన మాకు కూలీరేట్లు పెంచి ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేనేత కార్మిక సంఘం నాయకుడు ఎన్‌ఎం శేఖర్, కమల్‌దాసులు కోరారు. మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీలోని గేట్‌పుత్తూరులో చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మీటర్ చేనేత వస్త్రాన్ని పవర్‌లూమ్‌లో నేస్తే 7.50రూపాయలు ఇస్తున్నారని వారికి నేయడానికి ఖర్చు 5 రూపాయలు అవుతోందని, విద్యుత్ చార్జి 1.50 రూపాయల వస్తుందన్నారు. ఒక్కరూపాయితో తాము జీవనం సాగించలేకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్ పై నాలుగురూపాయలు పెంచితే తాము ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉందన్నారు. వీటి కోసం గత రెండురోజులుగా చేనేత కార్మికులు పనులు చేయకుండా నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఇలాంటి వాటిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. తమ సమస్యలు తెలుపడానికి టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నప్పటికీ వారు ఎప్పుడు తమ గోడు పట్టించుకోలేదన్నారు. కార్మిక శాఖ అధికారులు తూ తూమంత్రంగా పర్యవేక్షిస్తున్నారే తప్ప తమ కష్టాలను తీర్చడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ నిరాహార దీక్షలో మాజీ కౌన్సిలర్ స్వర్ణ శంకర్, డి ఎస్ ఆర్ముగం, ఓసూరప్ప, షణ్ముగం, ఎం ఆర్ముగం పాల్గొన్నారు.
నారాయణవనంలో
చేనేత కార్మికుల కూలీలు పెంచాలని కోరుతూ నారాయణవనంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల నాయకుడు లోకనాధం మాట్లాడుతూ చేనేత కార్మికులు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో అధికంగా ఉన్నారన్నారు. అందులో నారాయణవనం, పుత్తూరు, చింతలపట్టెడ, సత్రవాడ, ఏకాంబరకుప్పం, నగరి, తుంబూరు, పాలమంగళం గ్రామాల్లో పవర్‌లూమ్ కార్మికులు ఎక్కువగా ఉన్నామని, వారిని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమయ్యిందన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు. ఈ నిరాహార దీక్షలో పలువురు కార్మికలు పాల్గొన్నారు.
చేనేత కార్మికులు అయిన మాకు కూలీరేట్లు పెంచి ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం
english title:
hunger strike
Date:
Wednesday, March 7, 2012