![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/vidudalaku%20adee%20lekka.jpg)
ఛత్రపతి, మనోజ్‌నందం, మహీ, కృష్ణుడు ముఖ్య పాత్రల్లో జి మిరాకిల్స్ స్టూడియోస్ పతాకంపై మోహన్ జి.ఎం.సి, అంజన్‌బాబు, ఎన్.రమ్యప్రవీణ్.డి నిర్మించిన చిత్రం ‘అదీలెక్క’. సంగీత దర్శకుడు చిన్ని చరణ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌లో వున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమా సంతృప్తికరంగా వచ్చింది. కాలేజీ నేపథ్యంలో పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది. ప్రముఖ హాస్యనటులు నటించిన ఈ చిత్రం నాన్‌స్టాప్‌గా వినోదాన్ని పంచుతుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. మా బ్యానర్‌కు మంచి పేరుతెచ్చిపెట్టే చిత్రమిది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది’’ అని చెప్పారు. ఇతర పాత్రల్లో శ్రవణ్ రవీందర్, పోసాని కృష్ణ మురళి, అన్విక, అక్షయ, ప్రియాంక, పృథ్వీ, ధన్‌రాజ్, తా.రమేష్, జబర్‌దస్త్ ఫణి, శకలక శంకర్, అంబటి శీను, మాడ వెంకటేశ్వరరావు, సుద్దాల అశోక్‌తేజ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, ఆరీఫ్ లలానీ, ఎడిటింగ్: ఎడిటర్ వెంకటేష్, ఆర్ట్: మధు రెబ్బ, సమర్పణ: మల్లేష్ కొండేటి, నిర్మాతలు: మోహన్ జి.ఎం.సి, అంజన్‌బాబు, ఎన్.రమ్య ప్రవీణ్.డి, దర్శకత్వం: చిన్ని చరణ్.