దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ రూపొందించిన ‘నా బంగారుతల్లి’ చిత్రానికి మరో ప్రతిష్ఠాకరమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరానికిగాను ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 2013, బెస్ట్ ఫిలిం మేకర్ ఆఫ్ ద ఇయర్‌గా రాజేష్ టచ్‌రివర్, బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఫెస్టివల్ ఐఎఫ్‌ఎఫ్‌సిఆర్‌ఎమ్-2013 అవార్డులను కైవసం చేసుకుంది. బినామీ పేర్లపై విదేశాలకు మనుషులను చేరవేసే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 300 చిత్రాలు పోటీపడితే అందులో 30 చిత్రాలను మాత్రమే ఎంపిక చేశారు. అమెరికా, సౌత్‌కొరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్, మలేసియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఓ యదార్థ కథతో రూపొందించిన ఈ చిత్రానికి అన్ని అవార్డులు రావడం ఆనందంగా ఉందని దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెలిపారు.
................
అవార్డు అందుకుంటున్న దర్శకుడు రాజేష్ టచ్‌రివర్
దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ రూపొందించిన ‘నా బంగారుతల్లి’
english title:
naa
Date:
Tuesday, December 3, 2013