న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్)పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) విధించిన నిషేధం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగనుంది. ఎన్నికల సమయం లో సరైన విధివిధానాలను పాటించలేదని గత ఏడాది డిసెంబర్‌లో ఐబిఎఫ్‌పై ఎఐబిఎ నిషేధం విధించింది. అంతేగాక, అభే సింగ్ చౌ తాలా అధ్యక్షతన ఏర్పడిన కార్యవర్గాన్ని గుర్తించే ప్రసక్తి లేదని స్ప ష్టం చేసింది. అయతే, ఇప్పటి వరకూ కార్యవర్గానికి కొత్తగా ఎన్నిక లను నిర్వహించే దిశగా ఐబిఎఫ్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ఎఐబిఎ వర్గాలు ప్రకటించాయ. ఐబిఎఫ్ తన వైఖరిని మార్చుకోకపోతే, మ రింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించాయ.
న్యాయబద్ధమైన వాటాను కోరుతున్నాం..
ముంబయ, డిసెంబర్ 3: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదాయంలో సుమారు 75 శాతం మన దేశం నుంచే అందుతున్న దని, కాబట్టి లాభాల్లో తాము న్యాయబద్ధమైన వాటనే కోరుతున్నా మని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి సంజ య్ పటేల్ స్పష్టం చేశాడు.
భారత్ విజయ పరంపర
హోషియార్పూర్, డిసెంబర్ 3: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత్ విజయ పరంపర కొనసాగుతున్నది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో గెలుపొందిన భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ను 55-27 తేడాతో ఓడించింది. మహిళల జట్టు కూడా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కెన్యాను 56-21 తేడాతో చిత్తుచేసింది.
భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్)పై అంతర్జాతీయ
english title:
ibf
Date:
Wednesday, December 4, 2013