హైదరాబాద్, డిసెంబర్ 4: రచ్చబండలో మంజూరై పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను వెంటనే ఈ నెల 15 లోగా పంపిణీ చేయాలని మున్సిపల్ డిప్యూటీ కమీషనర్లను, ఎంపిడిఓలను రంగారెడ్డి జిల్లా కలెక్టరు బి.శ్రీ్ధర్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఓలు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో ఇటీవల రచ్చబండలో పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, దీపం పథకాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ, కొత్తగా మంజూరైన పెన్షన్లలో అర్బన్ ప్రాంతంలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ మున్సిపల్ పరిధిలో 75 శాతం వరకు ఇంకా పంపిణీ చేయకుండా ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులను జిల్లాలో 59 శాతం మాత్రమే లబ్దిదారులకు అందజేయడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో 64 శాతం పంపిణీ చేయగా పట్టణ ప్రాంతాల్లో 49 శాతం మాత్రమే పంపిణీ జరిగిందని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వారి సంబంధీకుల నుండైనా వివరాలు సేకరించి వెంటనే వారికి అందజేయాలని తెలిపారు. ఈ నెల 31 వరకు రేషన్ కార్డులకు సంబంధించి ఫోటోలు, ఆధార కార్డులను ఆన్‌లైన్ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాకు మొదటి, రెండవ విడత రచ్చబండల 49,686 కొత్త ఇళ్లు మంజూరయ్యాయని వీటిలో 31,310 ఇళ్లకు సంబంధించిన మంజూరీ పత్రాలను లబ్దిదారులకు అందజేసామని అన్నారు. గృహనిర్మాణ శాఖ ఎఇలు ఈ నెల 6 నుండి 30వ తేదీ వరకు గ్రామాల్లో పర్యటించి సర్పంచుల సమక్షంలో గ్రామసభలు నిర్వహించి ఇండ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని దీనితో అవకతవకలు కూడా బయటపడతాయని తెలిపారు. లబ్దిదారులో భార్యగాని, భర్తగాని ఎవరో ఒకరు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టరులో ఉన్నట్లయితే ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసు, రెవెన్యూశాఖకు ఆదేశాలు ఇస్తామని కలెక్టరు తెలిపారు. అక్టోబర్ నెలలో కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలను నియమించిన బృంధాలు వెంటనే నివేదకలను కలెక్టరేటుకు సమర్పించాలని ఆయన ఆదేశించారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి మండలంలో ఐకెపి ద్వారా 10వేలు, ఉపాధి హామీ ద్వారా 5వేలు, ఆర్‌విఎం ద్వారా 3 వేలు అందజేయడం జరుగుతుందని, మండల అధికారులు వికలాంగులతో సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రేషన్ కార్డులో పేరు లేకపోయినా కుటుంబంలో వికలాంగులైన వారికి వారి వివరాలను 10వ తేదీలోపు సంబంధిత మండల అధికారులకు పంపాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, జడ్పీ సిఇఓ రవీందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి వరప్రసాద్‌రెడ్డి, డ్వామా పిడి చంద్రకాంత్‌రెడ్డి, సిపిఓ బాలకృష్ణ, డిఎస్‌ఓ నర్సింహ్మారెడ్డి, ఆర్డీఓలు చంద్రశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, సూర్యారావు తదితర జిల్లా అధికారులు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
రెండు నెలల పించన్లు ఒకేసారి పంపిణీ
రచ్చబండలో కొత్తగా పంపిణీ చేసిన పెన్షన్లకు సంబంధించిన లబ్దిదారులకు అక్టోబర్, నవంబర్ మాసాల రెండు నెలల పెన్షన్లను ఒకేమారు ఇస్తామని జిల్లా కలెక్టర్ బి.శ్రీ్ధర్ తెలిపారు. కొత్తగా మంజూరైన పెన్షన్‌దారులు ఈ విషయాన్ని గమనించాలని, గతంలో వికలాంగుల పెన్షన్లలో ఇవ్వని పెన్షన్లను కూడా మొత్తం అన్ని నెలలు కలిపి చెల్లిస్తామని ఆయన తెలిపారు. రెండు నెలల పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని, రెండు నెలలు కలిపి పెన్షన్ ఇవ్వనట్లయితే జిల్లా డిఆర్‌డిఎ అధికారికి గాని, కలెక్టరుకు గాని ఫిర్యాదు చేయవచ్చని ఆయన లబ్దిదారులకు సూచించారు.
ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా పనిచేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 4: ప్రభుత్వ భూముల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టరు చంపాలాల్ అన్నారు. బుధవారం కలెక్టరేటులో ప్రభుత్వ భూముల పరిరక్షణ, కోర్టు కేసులు, ఆధార్ సీడింగ్, ఏడవ విడత భూపంపిణీ, రెవెన్యూ సదస్సుల ఫిర్యాదులు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.