మేడ్చల్, డిసెంబర్ 4: స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడుతూ పేదల పొట్టకొడుతూ రియల్ వ్యాపారం చేస్తున్నారని టిడిపి నేత నక్క ప్రభాకర్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం టిడిపి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే శవయాత్ర, భారీర్యాలీ నిర్వహించారు. నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. మేడ్చల్‌లో ఎమ్మెల్యే కెఎల్ఆర్ 18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు అశోక్ మాదిగ ఆరోపించారు. తహశీల్ కార్యాలయానికి జాయింట్ కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నందారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంరావు, శేఖర్‌గౌడ్, చిన్న నర్సింహ్మ, రమేశ్, శ్రీనివాస్, నాగరాజు, నర్సింహ్మారెడ్డి, యాదగిరి, హరిమోహన్ రెడ్డి, మైసయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు రవి, నాగరాజు, ఎర్రోళ్ల యాదయ్య, ఎర్ర విజయ్‌రావు, బాల నర్సింహ్మ, రాజు, శివకుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
english title:
b
Date:
Thursday, December 5, 2013