బాలానగర్, డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్టాన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని సీనియర్ ఎడ్యుకేషనల్ అధికారిణి డాక్టర్. ఎన్ సంధ్యరాణి అన్నారు. బుధవారం ఫతేనగర్ కమ్యునిటీ హాల్‌లో అప్స సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌సి, ఎస్‌టిల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా అమలుపరిచి వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలన్నారు.సబ్‌ప్లాన్ చట్టం వచ్చి నెలలు గడుస్తున్నా వారికి ఏ మేరకు ఖర్చు చేశారని ప్రశ్నించారు.
ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టిలకు సబ్‌ప్లాన్ చట్టంపై ఏ మాత్రం అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అలాంటి వారికి సబ్‌ప్లాన్ చట్టంపై అవగాహన కల్పిస్తూ వారికి చెందాల్సిన నిధులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేయడమే అప్స సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం నిధుల మంజూరీలో వివక్ష చూపుతుందని ఈ విషయంలో అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. అభివృద్ధికి ఆమడ దూరంలో, సమస్యల వలయంలో బస్తీవాసులు కొట్టు మిట్టాడుతున్నాయని తెలిపారు. తక్షణమే అధికారులు సబ్‌ప్లాన్ చట్టానికి నిబంధనలు ఏర్పరిచి సక్రమంగా నిధులు మంజూరు చేసి ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆమె కొరారు. ఈ సదస్సులో కుతాడి రాములు, శివరాణి, కె.వెంకటేశ్వరి, శోభ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 4: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు తమ పేరును ఓటర్ల లిస్టులో నమోదుచేసుకుని రానున్న ఎన్నికల్లో సెక్యులర్ భావాల కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని హైదరాబాద్ పార్లమెంటు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.శైలజా క్రాంతికుమార్ అన్నారు.
బుధవారంనాడు పాతబస్తీలోని శారదా విద్యాలయ బాలికల డిగ్రీ పిజి కళాశాల ఆడిటోరియంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓటర్ల నమోదు, ఓటు విలువలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజా క్రాంతికుమార్ మాట్లాడుతూ యువతులు తమ ఓటును సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధి తమ బాద్యతా భావించాలని కోరారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ లలిత మాట్లాడుతూ విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యులనుకూడా ఓటర్లగా చేసి ఓటు ప్రత్యేకత, ప్రాధాన్యతలను తెలుపాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయరాలు ఎస్.్భరతి, యువజన కాంగ్రెస్ నాయకులు సుశీల్, ఆర్.ఆనంద్, జి.కార్తీక్‌చారి, ఆర్.చంద్రకాంత్‌తోపాటు కళాశాలకు చెందిన సుమారు 200మంది విద్యార్థినులు పాల్గొన్నారు.