కుషాయిగూడ, డిసెంబర్ 4: సామాన్య ప్రజలు, చిరుద్యోగులు, విద్యార్థులకు వంటగ్యాస్ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కుషాయిగూడలోని ఎల్‌పిజి పెట్రోలియం బంక్‌లో 5కేజీల వంటగ్యాస్ సిలిండర్లను కేంద్ర పెట్రోలియం మంత్రి పనబాక లక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏఎస్‌రావునగర్‌కు చెందిన రాఘవరెడ్డికి ప్రథమంగా 5కేజీల సిలిండరుతో ఉన్న వంటగ్యాస్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్‌దేశంలోనే మొట్టమొదటిసారిగా బెంగుళూరులో ఐదుకేజీల గ్యాస్ సిలిండర్లను పెట్రోలుబంకుల్లో అమ్మడం ప్రారంభించారని చెప్పారు. మన రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గంలో ప్రారంభించామని, ఎమ్మెల్యే రాజిరెడ్డి అభ్యర్థన మేరకు తొలుత ఇక్కడ నూతనంగా ప్రారంభించామని తెలిపారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరానికి వలస వచ్చిన వారికి, ఉద్యోగులకు, విద్యార్థులకు గ్యాస్ కనెక్షన్ గొడవ లేకుండా ఈ ఐదుకేజీల సిలిండర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వంటగ్యాస్ ధరలు పెరుగుదల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం పెట్రోలియం శాఖ ఆధీనంలో మాత్రమే ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో వంటగ్యాస్ ధరలు పెరగకుండా చూస్తానని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో పెట్రోలియం శాఖ అధికారులు నిషివాసదేవ, హరిప్రసాద్, సుధాకర్‌రెడ్డి, కాప్రా కార్పొరేటర్ కొత్త రామారావు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సామాన్య ప్రజలు, చిరుద్యోగులు, విద్యార్థులకు
english title:
i
Date:
Thursday, December 5, 2013