కడప , మార్చి 6 : విద్యార్థులు ప్రపంచ దృక్పథంపై విజ్ఞానం పెంపొందించుకోవాలని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం వైవియూలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన నేషనల్ సెమినార్ ఆన్ ఎమరింగ్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ ఇన్ చెంజ్ గ్లోబల్ ఫర్‌ఫెక్యూటివ్ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుని, పోటీతత్వం పెరిగిందన్నారు. పరిపాలన పద్ధతిలో విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో హైయ్యర్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ పరిధిలోకి వెళ్తుందనే అనుమానం వ్యక్తం చేశారు. దానికి కారణం గ్లోబలైజేషన్‌యేనని పేర్కొన్నారు. ఎక్కడో ఒక దేశంలో యుద్ధం జరిగితే మన దేశంలో కూడా దాని ప్రభావం పడుతుందన్నారు. పెట్రోలియం, చమురు ధరలు పెరగడం, సెనె్సక్స్‌లో షెర్లు పడిపోవడం లాంటి అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. విద్యార్థులు గ్లోబలైజేషన్‌లో ఆలోచించడమే కాకుండా పనితనం కూడా ఆ దిశలోనే చూపించారని సూ చించారు. ఇండియా మేనేజ్‌మెంట్, గ్లోబలైజేషన్ మేనేజ్‌మెంట్ మధ్య విధానాలు, పద్ధతులు వేర్వేరు గనుక మార్పులను జాగ్రత్తగా సమీక్షించుకోవాలన్నారు. సదస్సులో అధ్యాపకుల ఉపన్యాసాన్ని విద్యార్థులు నోట్ చేసుకోవాలన్నారు. ఈ సదస్సులు సద్వినియోగం చేసుకోకపోతే తరువాత సదస్సులు కోల్పోతారని హెచ్చరించారు. కథలా వినకుండా ప్రతిదీ రికార్డు చేసుకోవాలని హితవు పలికారు. మార్కుల కోసం, యోగ్యతా పత్రాల కోసం కా కుండా విజ్ఞానం పెంపొందించుకునే దిశలో చదువుకోవాలన్నారు. ప్రొఫెసర్ వి. వెంకట రమ ణ డీన్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆఫ్ హైదరాబాద్ మాట్లాడుతూ యోగివేమన విశ్వవిద్యాలయం నేడు దేశంలోనే అగ్రగామి గా ఉందన్నారు. విద్యార్థులు గ్లోబల్ మైండ్ సెట్ పెంపొందించుకోవాలన్నా రు. టీమ్ వర్క్‌తో ముందుకు సాగాలన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా, అరేబియా, చైనా, ఇండియా మేనేజ్‌మెంట్ రంగాల్లో ముందున్నాయన్నారు. చైనా దేశం ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ప్రతి దేశ పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలన్నా రు. విద్యార్థులు యూనివర్శిటీ సర్ట్ఫికెట్‌తో పాటు విజ్ఞానాన్ని, వినయాన్ని సృజనాత్మకత, కొత్త తనాన్ని తప్పని సరిగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. జాతీయ సదస్సు సమన్వయ కర్త సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులు మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పుస్తకాలు చదవడంతో పాటు దిన పత్రికలు చదువుతూ అప్‌టుడేట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుంటూ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు హైదరాబాద్ ప్రొఫెసర్ ఆర్‌ఎస్, వేంకటేశ్వర యూనివర్శిటీ తిరుపతి ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి, కోచ్ గోడ్ ప్రొఫెసర్ వాసుదేవమూర్తి, జెఎన్‌టియు ప్రొఫెసర్ నందరాజు, ఎస్.కె. యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రేమ్‌చంద్, పాండిచ్చేరి యూనివర్శిటీ ప్రొఫెసర్ నంబిరాజు, వైవియూ ప్రిన్సిపల్ ఆచార్య టి. వాసంతి, ఉపకులపతి సతీమణి విజయలక్ష్మీ, బోధనా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
===
బిఇడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫలితాలు విడుదల
బిఇడి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్‌ఐ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ కోర్సు పరీక్షలు మూగ, చెవిటి, బధిరులకు ప్రత్యేకంగా యోగివేమన యూనివర్శిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కోర్సు హెలన్ కెల్లర్ కాలేజి ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కడప నిర్వహిస్తోందని, వైవియూ అప్లియేషన్, రిహబ్లియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే అఫ్రువ్ పొందిందన్నారు. 25 మంది బధిరులు పరీక్షలు రాయగా 21 మం ది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ కోర్సు చేసిన వారు విద్యాశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖ, తిరుపతి తిరుమల దేవస్థానాలు, ప్రభుత్వేతర సంస్థలు, బధిర పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావచ్చన్నారు. అలాగే రాజీవ్ విద్యా కమిషన్ నిర్వహిస్తున్న ఐఇ డిసిలో రాష్ట్రంలోని ప్రతి మండలానికీ ఇద్దరు చొప్పున రిసోర్స్ టీచర్స్ అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. డీఎస్సీ రాసేందుకు అర్హత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత బోధన సిబ్బంది పాల్గొన్నారు.
====
అంగన్‌వాడీల నియామకాల కోసం అభ్యర్థుల ఎదురుచూపు
ప్రొద్దుటూరు, మార్చి 6: అసెంబ్లీ రూరల్ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులకు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా వాటిని గురించి పట్టించుకోక పోవడంతో అభ్యర్థులు ఎదురుచూపులు చూస్తున్నారు. 2011 జూన్‌లో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లోని అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో ఎంతోమంది దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 80శాతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, ఆయాల పోస్టులకు ఇంటర్వ్యూ లు జరిపి నియామకాలు జరిగినా ప్రొద్దుటూరు అసెంబ్లీ పరిధిలో మాత్రం ఇంత వరకు ఇంటర్వ్యూలు జరపకపోవడంతో దరఖాస్తు దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాప్యానికి కారణం ఏమిటో తెలియడం లేదని పలువు రు అభ్యర్థులు వాపోతున్నారు. రాజకీయ కారణాల వల్ల మె రిట్ ఉన్నఅభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చొ రవ తీసుకొని ప్రొద్దుటూరు అసెంబ్లీ పరిధిలో అంగన్‌వాడీ వర్కర్ల నియామకాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.