న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ధ్యాన్ చంద్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన జూనియర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మొదటి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. పటిష్టమైన నెదర్లాండ్స్‌ను ఢీకొన్న భారత్ 2-3 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. భారత యువ ఆటగాళ్లు చివరి వరకూ గట్టిపోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. భారత్ తరఫున గుర్జీందర్ సింగ్ 13, ఆకాష్‌దీప్ 42 నిమిషాల్లో గోల్స్ చేశారు. నెదర్లాం డ్స్ ఆటగాడు వాన్ బాల్ మూడో నిమిషంలో ఒక టి, 28వ నిమిషంలో మరొకటి చొప్పున రెండు గో ల్స్ సాధించాడు. రిజ్‌కెల్స్ ఓ గోల్ చేసి నెదర్లాం డ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3-1 తేడాతో జర్మనీపై విజయం సాధించింది. పాకిస్తాన్ 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా 5-2 ఆధిక్యంతో అర్జెంటీనాపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-3 తేడాతో స్పెయిన్‌పై గెలిచింది. గ్రూప్ ‘సి’లో కొరియా 7-4 స్కోరుతో కెనడాపై గెలుపొందింది. గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్‌లో మలేసియా 3-2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి శుభారంభం చేసింది.
ధ్యాన్ చంద్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన
english title:
j
Date:
Saturday, December 7, 2013