న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కామనె్వల్త్ రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు మొత్తం 14 పతకాలు లభించాయి. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం జొహానె్నస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ ఏడు స్వర్ణలు, నాలుగు రజతాలు, మరో మూడు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. అంతేగాక, టీం టైటిల్‌ను కూడా గెల్చుకుంది. నిబంధనలను అనుసరించి ఒక్కో విభాగంలో ఒక దేశం అత్యధికంగా ఇద్దరిని బరిలోకి దించవచ్చు. ఏడు విభాగాల్లో పోటీలు జరిగితే, అన్ని విభాగాల్లోనూ భారత్‌కు పతకాలు లభించడం విశేషం. సందీప్ తోమర్ (55 కిలోల విభాగం), జైదీప్ (60 కిలోలు), అమిత్ కుమార్ ధంకర్ (66 కిలోలు), ప్రవీణ్ రాణా (74 కిలోలు), పవన్ కుమార్ (84 కిలోలు), సత్యవర్త్ కడియన్ (96 కిలోలు), జోగీందర్ కుమార్ (120 కిలోలు) తమతమ విభాగాల్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. నరేందర్ (55 కిలోలు), రవీందర్ సింగ్ (60 కిలోలు), నరేష్ (84 కిలోలు), రోహిత్ పటేల్ (120 కిలోలు) రజత పతకాలను సాధించారు. అరుణ్ కుమార్ (66 కిలోలు), ప్రదీప్ (74 కిలోలు), హర్‌దీప్ (96 కిలోలు) కాంస్య పతకాలను స్వీకరించారు. 1985 నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 2011 నుంచి భారత్ టీం టైటిల్‌ను వరుసగా మూడు పర్యాయాలు గెల్చుకోవడం విశేషం. ఈ పోటీల్లో భారత్ తరఫున పా ల్గొన్న దాదాపు అందరికీ పతకం లభించడం పట్ల రెజ్లింగ్ అధి కారులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ రెజ్లింగ్‌లో మన దేశం ఉన్నత ప్రమాణాలను అందుకొని, ప్రత్యర్థులకు గట్టిపోటీ నిస్తున్నదని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
కామనె్వల్త్ రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో
english title:
c
Date:
Saturday, December 7, 2013