లండన్, డిసెంబర్ 6: సంచలనం సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో వైట్హాక్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లపై పోలీస్ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. 22 ఏళ్ల మైఖేల్ బొటెంగ్, హకీమ్ అడెలాకున్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపై చీటింగ్ కేసును నమోదు చేశారు. కాన్ఫరెన్స్ సౌత్ లీగ్‌లో వైట్హాక్కు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరూ బుకీలకు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని పోలీస్ అధికారులు తమ చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ కేసులో తొలుత ఆరుగురిని అరెస్టు చేయగా, ఇద్దరిపై చార్జిషీటు దాఖలైంది. మిగతా వారికి ఫిక్సింగ్ కేసుతో ఉన్న సంబంధంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలావుంటే, ఫిక్సింగ్ కేసులో ఆరోపణ లు ఎదుర్కొంటున్న ఇద్దరు క్రీడాకారుల ను తొలగించడానికి వైట్హాక్ అధికారు లు రంగం సిద్ధం చేస్తున్నారు.
సంచలనం సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్
english title:
m
Date:
Saturday, December 7, 2013